సాధారణంగా ఒక వయసు వచ్చాక ముఖం పై మొటిమలు కావడం సర్వసాధారణం. యువతీయువకులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యను ఒక వయసులో ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ  మొటిమల సమస్య కూడా తీరిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే కొంతమందిలో మాత్రం అటు వయసుతో సంబంధం లేకుండా మొటిమల సమస్య మాత్రం తరచూ వేధిస్తూనే ఉంటుంది. మొటిమలను తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి వారు ఇక తమకు ఉన్న మొటిమల సమస్య కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏకంగా ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు తమ ముఖాన్ని దాచుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా మొటిమల సమస్యలతో బాధపడుతూ చివరికి బలవన్మరణానికి పాల్పడింది యువతి. ఎన్ని క్రీములు వాడినా ఎంత మంది డాక్టర్ల దగ్గరికి తిరిగిన మొటిమల సమస్య నుంచి మాత్రం బయటపడలేక పోయింది సదరు యువతి. ఇక పెళ్లి చూపులకు వచ్చిన వారు ఆ మొటిమల కారణంగా ఆమెను రిజెక్ట్ చేస్తూ వచ్చారు.


 దీంతో ఆ యువతి మనస్సు మరింత నొచ్చుకుంది. దీంతో పెళ్లి కుదరలేదు అని ఎంతగానో మనస్థాపం చెంది..  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్ బందా జిల్లా అజిత్ ఫారాలో వెలుగులోకి వచ్చింది. ఎంత మంది డాక్టర్ల దగ్గరికి తిరిగిన మొటిమల సమస్య పరిష్కారం కాలేదని.. ఇక పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. వయసొచ్చిన కూతురికి పెళ్ళిచేసి ఒక అయ్య చేతిలో పెట్టాలని అనుకున్నామని కానీ ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు అంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: