మనిషి జీవితం గ్యారెంటీ లేనిది ఎప్పుడు ప్రాణం పోతుంది అన్నది కూడా ఊహకందని విధం గానే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయం  లో అనుకోని విధంగా మృత్యువు కబళిస్తు ఉంటుంది.  తద్వారా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. అతను మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ జాబ్ సాధించి సమాజానికి సేవ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఎంతో కష్టపడి చదివాడు.  ఇటీవల జరిగిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు కూడా హాజరయ్యాడు.


 అయితే ఇలా పరీక్ష జరిగిన రోజే తమ్ముడు పెళ్లి కూడా ఉంది. ఈ క్రమంలోనే  తమ్ముని పెళ్లి లో పెద్దగా వ్యవహరించాల్సిన అన్నా అంతకంటే  ఎస్సై పరీక్ష ముఖ్యం అనుకుని భావించి పరీక్ష రాయడానికి వచ్చాడు. ఇక పరీక్ష ముగించు కుని ఎంతో ఉత్సాహం తో తమ్ముడు పెళ్లి కి బయల్దేరాడు. కానీ అంత లో ఊహించని ఘటన అతని ప్రాణాలు తీసింది. రోడ్డు ప్రమాదం రూపం లో అతన్ని మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.


 ఆంజనేయులు అనే యువకుడు ఎస్సై పరీక్ష రాసి తమ్ముడు పెళ్లి కోసం ఎంతో ఉత్సాహంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వెనక నుంచి వచ్చిన ట్యాంకర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. జీడిమెట్ల టిఎస్ఐ ఐ సి కాలనీ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు ఆంజనేయులు తమ్ముడు పెళ్లి ఉండటంతో పరీక్ష రాసిన ద్విచక్రవాహనంపై బయలుదేరగా  వెనుక నుంచి వచ్చిన వాహనం  ఢీ కొట్టడంతో  తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన తో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నిండిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: