ఇటీవల కాలంలో ఎన్నో రకాల విషపూరితమైన పాములు  జనావాసాల్లోకి వస్తూ ఉన్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక చుట్టుపక్కల ప్రాంతాలు కాస్త శుభ్రంగా లేవు అంటే చాలు ఇక అక్కడికి విషపూరితమైన పాములు వచ్చి స్తావరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. అటువైపుగా ఎవరైనా మనుషులు వచ్చారు అంటే చాలు వాటికి ప్రమాదం తలెత్తుతుందేమో అని భావించి చివరికి కాటు వేయడం లాంటివి జరుగుతున్నాయి.  ఇక ఇలా పాముకాటు కారణంగా ఆసుపత్రి పాలు అవుతున్నవారు కొంతమంది అయితే.. చివరికి ప్రాణాలు కోల్పోతూ ఉన్నవారు మరికొంతమంది.


 ఇంకొంతమంది కాస్త అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకుంటున్న సమయంలో పాము కాటుకు గురైతే వెంటనే తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక తండ్రి మాత్రం తన కొడుకును రెండు పాములు ఒకేసారి కరవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో ఏకంగా ఆ రెండు పాములను దారుణంగా చంపి బాలుడుతో పాటే ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.


 ఈ ఘటన తమిళనాడు లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. తిరువల్లూరులో ఉండే ఒక బాలుడిని రెండు పాములు కాటు వేసాయ్. అయితే వెంటనే అప్రమత్తమైన బాలుడు తండ్రి కోపంతో ఊగి  పోయాడు. ఆ రెండు పాములను చంపేశాడు. ఈ క్రమంలోనే తన కుమారుడితో పాటే ఆ పాములను కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. రెండు విషపూరితమైన పాములు ఒకేసారి కాటు వేయడంతో ఇక ఏడేళ్ల బాలుడి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక అతన్ని కాటు వేసిన పాములను వెంటే తీసుకువెళ్లడంతో డాక్టర్లు అది చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: