అయితే శంకర్ కు ఒక లవర్ ఉంది... ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఆటోమేటిక్ గా మన లవర్స్ గురించి ఫ్రెండ్స్ కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా శంకర్ తన లవర్ గురించి మణికంటకు చెప్పడం మరియు పరిచయం చేయడం జరిగిపోయాయి. అయితే మణికంఠను ఫ్రెండ్ లాగే అనుకున్న ఆ అమ్మాయి సరదాగా మాట్లాడేది. కానీ ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న మణికంఠ తనను ఎలాగైనా లొంగదీసుకోవాలని ట్రై చేశాడు. ఆ క్రమంలో తనకు బూతు మెసేజ్ లు చేశాడు. అయితే ఇలా మెసేజ్ లు చేయవద్దని చాలాసార్లు అమ్మాయి చెప్పినా వినకుండా పదే పదే ఇబ్బంది పెట్టడంతో, ఆ అమ్మాయి తన లవర్ శంకర్ కు విషయాన్ని చెప్పింది. దీనితో తట్టుకోలేని శంకర్ మణికంఠను చంపేయాలని ప్లాన్ చేసాడు.
గత శుక్రవారం ఇద్దరు బాగా మందుతాగి మాటల్లో ఈ మెసేజ్ ల గురించి అడిగాడు... ఇక ఇద్దరూ మత్తులో ఉండడంతో మాటా మాటా పెరిగి శంకర్ మణికంఠను బీరు బాటిల్ తో కొట్టి చంపేసి, అక్కడి నుండి పారిపోయాడు. అలా స్నేహానికి శంకర్ సమాధి కట్టాడు, ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఆ మరణం గురించి తెలుసుకున్న పోలీసులు శంకర్ మణికంఠలు కలిసి తాగారు అన్న విషయాన్ని తెలుసుకుని అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి