తల్లి పిల్లల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది అని అంటూ ఉంటారు అందరూ. ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే చాలు అప్పటివరకు ఎంతో శాంతంగా ఉన్న తల్లి అపరకాలిలా మారిపోయి  పిల్లలకు సమస్య తలపెడుతున్న వారిని తరిమికొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది అని ఇప్పటివరకు ఎన్నో ఘటనల ద్వారా అందరూ తెలుసుకున్నారు అని చెప్పాలి. అయితే తండ్రి పిల్లల విషయంలో కాస్త గంభీరంగా ఉన్నప్పటికీ ఇక పిల్లలకు  అన్ని తానై తండ్రి చూసుకుంటాడు అన్న విషయం కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటుంది. ముఖ్యంగా మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ తండ్రి కూతుర్ల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని అందరూ అంటూ ఉంటారు.


 ఇకపోతే ఇటీవల ఈక్విడార్ లో వెలుగు చూసిన ఒక ఘటన మాత్రం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కూతురు మీద అమితమైన ప్రేమను పెంచుకున్న ఒక తండ్రి ఏకంగా ఎవరు తీసుకొని ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందం..టే ఈక్విడార్ కు చెందిన రేనే సలీనాస్ రామోస్ అనే వ్యక్తి తన కుమార్తెల సంరక్షణ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా రిజిస్ట్రీ కార్యాలయానికి వెళ్లి చట్టబద్ధంగా తన లింగాన్ని మార్చుకున్నాడు.


 భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కూతుర్లను తన వద్ద ఉంచుకోవాలని భావించాడు సదరు వ్యక్తి. చట్ట ప్రకారం ఇలా చేయడం కుదరదు.  అందుకే కూతుర్లపై ఉన్న వల్ల మాలిన ప్రేమ కారణంగా వారిని వదులుకునేందుకు అతని మనసు ఒప్పుకోలేదు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను తల్లికి అప్పగిస్తారు. దీంతో తండ్రి కావడం వల్ల తనకు కూతురు దూరమవుతున్నారూ భావించి ఏకంగా లింగాన్ని మార్చుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. కూతుర్ల కోసం మహిళగా కూడా మారిపోయాడు. ఈ క్రమంలోనే చట్ట ప్రకారం మహిళలకు మాత్రమే పిల్లలను చూసుకునే హక్కు ఉండడంతో ఇక ఇప్పుడు తాను కూడా స్త్రీనే అని నేను కూడా ఒక తల్లిని అని నాకు పిల్లలను అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించగా.. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: