ఇటీవల కాలంలో కొత్త కొత్త కాన్సెప్ట్ లతో  ఎన్నో సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్లు కూడా సాధిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక మరోవైపు కమర్షియల్ సినిమాలు ఎప్పటిలాగానే థియేటర్ల వద్ద సందడి చేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. అయితే ఇక ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు తరలి వెళ్తున్నారు. అయితే ఇలా థియేటర్లలోకి వెళ్ళిన ప్రేక్షకులు సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత కూడా తమను తాము హీరోలా ఫీలవుతున్నారు. దీంతో సినిమాల్లో హీరోలు చేసినట్లుగానే నిజ జీవితంలో ప్రేక్షకులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి.


 గతంలో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసినట్లుగానే ఇక నిజజీవితంలోనూ కొంతమంది అక్రమార్కులు ఇలాంటి ప్లాన్ అమలు చేసి పోలీసులకు షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఏకంగా లవ్ టు డే సినిమాను అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఒకరి ఫోన్ ఒకరు మార్చుకోవడం చేస్తూ ఉంటారు. తద్వారా ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు పరీక్షించుకుంటారు. సినిమా చూసి ఎంతో మంది యూత్ కాస్త ప్రభావితం అయ్యారు అని చెప్పాలి.


 ఇక్కడ ఓ యువకుడు ఇలాంటిదే చేశాడు. అందరిలాగా ఎంతో సాఫీగా పెళ్లి చేసుకోకుండా ఇక లవ్ టు డే సినిమా చూసి ఒక వింత ప్రయత్నం చేశాడు. కానీ అది బెడిసి కొట్టింది. తమిళనాడు జిల్లా సేలం కు చెందిన 23 ఏళ్ల అరవింద్ అనే యువకుడికి నిశ్చితార్థం జరిగింది. అయితే లవ్ టు డే సినిమాలో లాగా ఇక కాబోయే భార్యతో సెల్ఫోన్లు మార్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మార్చాడు. అయితే ఇక అరవింద్ ఫోన్ చెక్ చేస్తుండగా.. యువతి దిమ్మ తిరిగిపోయింది. అందులో బాలిక న్యూడ్ వీడియో ఉండడంతో పాటు ఎన్నో పోర్న్ వెబ్సైట్లు కూడా కనిపించాయి.  దీంతో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా చివరికి పెళ్లి క్యాన్సిల్ అయింది. పోలీసులు అరవింద్ ను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: