ఖైదీలు జైలు నుంచి తప్పించుకునే ఘటనలు ఇటీవల కాలంలో సినిమాల్లోనే కాదండోయ్ అటు నిజజీవితంలో కూడా కాస్త ఎక్కువ అయ్యాయి అని చెప్పాలి. ఇక అధికారుల కంట పడకుండా ఏదో ఒక విధంగా సరికొత్తగా ప్లాన్ వేసి జైలు నుంచి తప్పించుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇక జైలు గోడలకు రంధ్రాలు పెట్టడం లేదా గోడ దూకి పారిపోవడం లేదంటే ఏకంగా జైలులోనే సొరంగం తవ్వి పారిపోవడం లాంటిది చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఖైదీలు జైలు నుంచి తప్పించుకునేందుకు వేసిన ప్లాన్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక్కడ ఖైదీలు చేసింది విని అందరూ ఇలాంటిదే చేస్తూ ఉన్నారు. ఏకంగా ఒక టూత్ బ్రష్ సహాయంతో జైలు నుంచి తప్పించుకోగలిగారు ఖైదీలు. అది కూడా ఎంతో పటిష్టంగా ఉండే జైలు గోడకు భారీ రంద్రం పెట్టి మరి ఇక జైలు నుంచి తప్పించుకున్నారు అని చెప్పాలి. ఈ ఘటన వర్జీనియా దేశంలో వెలుగు చూసింది. ఇక ఇందుకు సంబంధించిన వార్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. వర్జీనియాలోని అనేక్స్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. టూత్ బ్రష్ తో పాటు మెటల్ వస్తువులతో తయారుచేసిన సాధనాలను ఉపయోగించి గోడకు రంధ్రం పెట్టారు.



 ఇక ఆ తర్వాత ఎవరికంట పడకుండా ఆ రంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు కూడా తప్పించుకొని పారిపోయారు అని చెప్పాలి. అయితే ఇలా తప్పించుకున్న ఖైదీలను అటు పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. జైలు నుంచి తప్పించుకున్న కాసేపటికి గుర్తించి మళ్లీ అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. హెడ్ కౌంట్ సమీపంలోని ఒక రెస్టారెంట్లో ఇద్దరు ఖైదీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇక విచారణ చేపడుతున్నారు అన్నది తెలుస్తుంది.  ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: