ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది . ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు ముంచుకొస్తూ అటు మనిషి ప్రాణాలను తీసేయడానికి సిద్ధమైపోతున్నాయి. ఇలాంటి సమయం లో ఇక ఈ వైరస్ల నుంచి తప్పించుకొని హమ్మయ్య ప్రాణాలు దక్కించుకున్నాం అనుకునే లోపే సడన్ హార్ట్ ఎటాక్ లు ప్రాణాలు తీసేస్తున్నాయి. దీనికి తోడు ఇక మనిషి నిర్లక్ష్యం గా చేస్తున్న పనులతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి.


 ఇవేవీ చాలవన్నట్టు మనిషి క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ.. చివరికి విలువైన ప్రాణాలను బలవంతంగా తీసేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి  వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకి మనుషులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు.. చదువుకున్న వారి దగ్గర నిరక్షరాస్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా క్షణికావేషంలో విచక్షణ రహిత నిర్ణయాలు  తీసుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగు చూసింది.



 సెల్ ఫోన్ తో పాటు కేబుల్ టీవీ రీఛార్జ్ చేయమని అడిగినందుకు అతన్ని తల్లి మందలించింది. దీంతో మనస్థాపన చెందిన 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాటారంలో చోటుచేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న తరుణ్ రీఛార్జ్ కోసం తల్లి యశోదను డబ్బులు అడిగాడు. అయితే చదువుకునే వాడివి ఇవన్నీ నీకెందుకు... ముందు చదువు మీద దృష్టి పెట్టు అంటూ తల్లి మందలించింది. దీంతో ఎంతగానో మనస్తాపం చెందిన తరుణ్ చిన్న వయసులోనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: