ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత మనుషులు మరి ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా విచిత్రంగా ఆలోచిస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ఇదేదో సినిమా సన్నివేశం చూసినట్లుగానే ఉంది అనే భావన అందరికీ అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న కొంతమంది వ్యక్తులు ఏకంగా ట్రావెల్స్ పెట్టుకోవడానికి కారు దొంగతనాలు చేసిన ఘటన అందర్నీ షాక్ అయ్యేలా చేసింది అని చెప్పాలి.


 ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఎందుకంటే ఏకంగా పంక్చర్ షాప్ బిజినెస్ ను పెంచుకోవడానికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు చేసిన పని అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఏకంగా పంక్చర్ షాప్ బిజినెస్ పెంచుకోవడానికి అటువైపుగా వెళ్లే వాహనదారులందరినీ కూడా ఇబ్బందులకు గురిచేసారు. ఆ షాప్ యజమానులు ఏకంగా  రోడ్లపై వాహనాలు వెళ్ళాడానికి ముందే కొన్ని మేకులు ఇతర తీగలు వేయడంతో ఇక ఎన్నో వాహనాలు తరచూ పంక్చర్ అవుతూ ఉండేవి.


 అయితే కొన్నాళ్లపాటు ఇలా వాహనాలు పంక్చర్ అవుతూ ఉంటే పట్టించుకోని జనాలు.. ఆ తర్వాత  తరచూ ఒకే ప్రాంతంలో పంక్చర్లు అవుతూ ఉండడంతో.. ఇక ఇదేదో తేడాగా ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పంక్చర్ షాప్  నిర్వహించే వాళ్ళు తమ దుకాణానికి కిలోమీటర్ల పరిధిలో గల రోడ్లు చౌరస్తాల పై మేకులు ఇతర తీగలను వేశారు. అటువైపుగా వెళ్ళిన వాహందారులు పంక్చర్ కావడంతో సమీపంలో ఉన్న షాప్ వాళ్ళు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసిలాభ పడుతున్నారని పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: