మద్యం మత్తులో రెండుసార్లు తల్లిపై కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ ఈ విషయం బయటకు చెప్పులేక తల్లి గత కొంతకాలంగా లోలోపల కుమిలిపోతూ ఉంది. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆవేదన చెందుతూ ఉంది. అయితే ఇటీవల కొడుకు మరోసారి తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ ఇక భరించలేక తన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మహిళకు పోలీసులు మెడికల్ టెస్టు చేయించడం, పెద్ద కుమారుడితో పాటు మహిళ ఇంటి వద్ద నివసిస్తున్న స్థానికులు సాక్ష్యం చెప్పడంతో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. అలాగే రూ.50 వేల జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో వావివరసలు అనే తేడా లేకుండా కొంతమంది కామాంధులు రెచ్చిపోతున్నారు. సొంతవారిపైనే అత్యాచారానికి పాల్పడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిపైనే ఈ క్రూరుడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందరినీ షాకింగ్ కు గురి చేస్తోంది. ఇతడికి మరణశిక్ష విధించాలని, ఇలాంటివారి వల్ల సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతుందని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు పశ్చిమబెంగాల్ లో సంచలనంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి