సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే కూర్చున్న చోటు నుంచి ప్రపంచాన్ని మొత్తం చుట్టూ గలుగుతున్నాడు మనిషి. ఇక ఇలాంటి టెక్నాలజీ మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చింది. దీంతో ఇక ఒకప్పటి మూఢనమ్మకాలను పక్కన పెట్టేసి ఆధునిక జీవనశైలికి అలవాటు పడిపోతున్నాడు మనిషి. కానీ ఇంకా అక్కడక్కడ అనాగరిక జీవితాన్ని గడుపుతున్న జనాలు ఉన్నారు అన్న దానికి నిదర్శనంగా కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్ముతున్న కొంతమంది జనాలు చివరికి బురిడీ బాబాల చేతిలో మోస పోతున్నారు.


 ఇలా ప్రజల మూఢనమ్మకాలను బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంతమంది ఏకంగా బాధితుల నుండి డబ్బులు వసూలు చేయడమే కాదు ఇంకొంతమంది ఏకంగా అత్యాచారాలకు ఒడిగడుతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బదోహీలో కూడా ఇలాంటి ఓ దారుణ  ఘటన వెలుగు చూసింది. మంత్రిగాడిగా చలామణి అవుతున్న 52 ఏళ్ల వ్యక్తి 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దుష్టశక్తులను తరిమేస్తానని చెబుతూ.. ఇలా ఘోరానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు బురిడీ బాబాను అరెస్టు చేశారు.


 మీర్జాపూర్ నుంచి ఒక కుటుంబం సీతహర్షిని సందర్శించేందుకు వచ్చింది. అయితే అక్కడ మోతిలాల్ అనే 52 ఏళ్ల వ్యక్తి తాను క్షుద్ర మాంత్రికుడుగా పరిచయం చేసుకున్నాడు. బాధిత భార్యాభర్తల కూతురుకి దయ్యం పట్టిందని చెప్పడంతో నయం చేస్తాను అంటూ నమ్మబలికాడు. భూతవైద్యం ద్వారా యువతి శరీరం నుంచి దయ్యాన్ని తరిమి కొట్టాలని.. కుటుంబం నుంచి దాదాపు 4000 వసూలు చేశాడు. తర్వాత యువతి తండ్రులు ఆమెను మోతిలాల్ దగ్గరికి తీసుకెళ్లగా.. నిందితుడు యువతీని బైక్ పై దర్వాసి గ్రామంలోని ఆలయం వెనుక ఉన్న గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే మూడు గంటల తర్వాత మోతిలాల్ మహిళలను బయటకు తీసుకెళ్లి మరుసటి రోజు తనను కలవాలని.  ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాను బెదిరించాడు. అయితే బాధితురాలు తనకు జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ నీచున్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: