ఇటీవల కాలంలో దోపిడీ దొంగలు ఎంతల రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దారి గుండా వెళ్లే వాహనదారులను నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు  ఇక ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవలే ఏకంగా మహారాష్ట్రలో కూడా ఇలాంటి దారుణ ఘటన జరిగింది. ఏకంగా ఒక మినీ బస్సు పై అర్థరాత్రి దోపిడీ దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఏకంగా బస్సు డ్రైవర్ పై కాల్పులకు కూడా తెగబడ్డారు.


 అయితే దోపిడీ దొంగల దాడితో ఒక్కసారిగా అప్రమత్తమైన మినీ బస్సు డ్రైవర్.. ఒకవైపు బుల్లెట్ తగిలినా కూడా బస్సులో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు పెద్ద సాహసమే చేశాడు అని చెప్పాలి. ఏకంగా బస్సును ఆపకుండా 30 కిలోమీటర్ల వరకు నడుపుతూ.. వెళ్లి ఇక ఆ బస్సులో ప్రయాణిస్తున్న అందరిని కూడా సురక్షితంగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్లాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఏకంగా బస్సులో 17 మంది ప్రయాణికులు ఉండడం గమనార్హం.. వారందరూ కూడా అమరావతి నుంచి నాగపూర్ కు ఆలయం దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా.. నందు సమీపంలోని హైవే ఆరు పై ఈ ఘటన చోటుచేసుకుంది.


 అయితే అమరావతి లోని ఆలయాన్ని దర్శించుకుని ప్రయాణికులతో నాగపూర్ తిరుగు ప్రయాణమైనప్పటి నుంచి కూడా తమ బస్సును బొలెరో వాహనం వెంబడించింది అని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. అయితే బస్సు ను రోడ్డు పక్కకు తీసుకువెళ్లి వెనకాలే వస్తున్న బొలెరో వాహనానికి రెండు సార్లు దారి ఇచ్చినప్పటికీ వాళ్ళు ముందుకు వెళ్లలేదని.. వెనకాలే ఫాలో అవుతూ వచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమపై దాడి చేసిన బొలెరో వాహనం ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉంది అన్న విషయాన్ని ప్రయాణికులు తెలిపారు. బస్సు డ్రైవర్ పై కాల్పులు జరిపి బస్సును ఆపేందుకు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. బస్సు డ్రైవర్ కారణంగానే తాము ప్రాణాలతో బయటపడగలిగాము అంటూ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: