గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని తెలుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి గుంటూరు కృష్ణా జిల్లాలో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో చాలా వరకు టీడీపీ ఆధిక్యత కనబరిచింది. తద్వారా అక్కడ విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రం విడిపోయిన సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా జగన్ కంటే చంద్రబాబు అయితేనే ఆంధ్రాను సరి చేయగలరని నమ్మి ఓట్లు వేశారు.
కొత్త రాజధాని నిర్మాణం మిగతా అంశాల పరంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ఆయనకు చేటు చేశాయి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాజధాని నిర్మాణం చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేసింది. అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందని టీడీపీకి అనుకూలమైన వారికి భూములు తక్కువ ధరకు కట్టబెట్టారని ఆరోపించింది.
అమరావతి విషయంలో వైసీపీకి కలిసి వచ్చింది. కాబట్టి 2018 లో జరిగిన ఎన్నికలు వైసీపీ ఘన విజయం సాధించడానికి ఇది ఒక కారణమైంది. కానీ ప్రస్తుతం వైసీపీకి అంత ఈజీ కాదు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రజలు డిసైడ్ అయితే దేనికి ఓటేయాలి దానికి వేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే జగన్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకొని ఎన్నికల్లో ముందుకెళ్తేనే ఆయన విజయం సాధించే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి