రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఆయన పది ఏళ్లుగా గుంటూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన తాజాగా చంద్రబాబుపై నమ్మకం లేకనో.. మళ్లీ అధికారంలోకి వస్తామనే ఆశ లేకనో కానీ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు.


2024లో మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను. కానీ తప్పుకోవాలనే నిర్ణయించుకున్నాను. రెండు ఏళ్ల క్రితం తన తండ్రి వ్యాపారం నుంచి తప్పుకున్నారని ఈ నేపథ్యంలో రాజకీయాలను సమన్వయం చేసుకుంటూ వ్యాపారం చేయడం కష్టంగా మారిందని అందుకే రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కేసుల్లో ఈడీ తనను రెండు సార్లు విచారించిందని.. తన వ్యాపారాలపై కూడా నిఘా పెట్టిందని గల్లా తెలిపారు. సీబీఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రత్యక్షరాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు.


అయితే గల్లా జయదేవ్ కు ఈడీ సమన్లు ఇచ్చిన విషయం.. విచారించిన విషయం ఆయన చెప్పే వరకు ఎవరకీ తెలియదు. కనీసం మీడియాకు కూడా ఉప్పందలేదు. అంటే మోదీ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా అనే సందేహం అందిరిలో నెలకొంది. ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం లోక్ సభలో పోరాడినందుకే తనపై ఈడీ కేసులు బనాయించారని చెప్పకనే చెప్పారు.


ఒకవేళ మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఆయన కన్నా ముందు టీడీపీ అధినేత చంద్రబాబునే జైలులో పెట్టేవారు. ఆయన గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదాపై నానా రచ్చ చేశారు.   మరోవైపు వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆధారాలతో సహా చంద్రబాబుపై  విచారణ జరపాలని ఈడీకి, సీబీఐకి లేఖ రాసింది. అయినా కూడా చంద్రబాబుపై ఈడీ ఎందుకు కేసులు పెట్టడం లేదు.  ఇక్కడ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలను వాడుకుంటున్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పడానికి సాక్ష్యం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: