ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఎండల కంటే ఎక్కువగా ఉంది.  రాష్ట్ర విభజన తర్వాత ఓ సారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారం చేపట్టాయి.  దీంతో ఈ సారి ఏ పార్టీ బలంగా ఉందో చెప్పడం రాజకీయ విశ్లేషకులు సైతం అంచాన వేయలేకపోతున్నారు.  తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రస్తుత పాలన చూసి ఓటేయ్యాలని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు.


ఇక ప్రతిపక్ష టీడీపీ, జనసేన బీజేపీ కూటమి కట్టి  నమ్మకంతో ఉన్నారు.  ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని..ప్రజా ధనాన్ని ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు వాడుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. ఏ రంగంలోను వృద్ధి సాధించలేదని విమర్శిస్తున్నారు. నిజంగానే వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని ఉద్దరించలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయా అనే విషయంపై ఓ సారి లెక్కలు చూస్తే..


సాధారణంగా అభివృద్ధికి సూచికగా రాష్ట్ర జీఎస్ డీపీని పేర్కొంటారు. ఏపీ రూ.13.2లక్షల కోట్ల జీఎస్ డీపీతో దక్షిణాదిన నాలుగో స్థానంలో ఉంది. ఇది గత టీడీపీ ప్రభుత్వంలో 7.8లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో పాటు ఏపీ పర్ కెప్టా ఆదాయం టీడీపీ హయాంలో 1.50లక్షలు అయితే ఇప్పుడు 2.19లక్షలు. ఎగుమతులు 98,983 కోట్లు అయితే ఇప్పుడు 1.59 లక్షల కోట్లు.


ఎంఎస్ఎంఈ ఎంప్లాయిమెంట్ అప్పట్లో 4.40లక్షలు కాగా ఇప్పుడు 10లక్షలకు పైగా చేరింది. స్టార్టప్ ల విషయానికొస్తే గతంలో 530 ఉండగా.. ఇప్పుడు 1554కి చేరింది. ధాన్య సేకరణ గతంలో 2.6లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇప్పుడు 3.10లక్షల మెట్రిక్ టన్నులు. రైతు భరోసా కేంద్రాలు గతంలో ఏమీ లేకపోగా ఇప్పుడు 10778 లు ఆర్బీకేలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు టీడీపీ హయంలో 11 ఉండగా  ప్రస్తుతం 26 ఉన్నాయి.  ప్రభుత్వ ఉద్యోగాలు అప్పట్లో 3.9లక్షలు, ఇప్పుడు 6.9లక్షలుగా లెక్కలు చెబుతున్నాయి.  మరి ఇదంతా అభివృద్ధి కాదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: