ఏపీలో వైసీపీ గెలుస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు కూడా అదే ధీమాతో ఉన్నారు. ఏపీలో వైసీసీ వర్సెస్ టీడీపీ కూటమి పోరులో వైసీపీ బెటర్ అనుకునే వారు ఆ పార్టీనే గెలుస్తుంది అని అంటున్నారు. ఇంకా అనేక కారణాలు గెలుపునకు దోహదం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.


ఇక చంద్రబాబు మళ్లీ జగన్ వస్తే ఏపీ ని రౌడీ రాజ్యం చేస్తారని.. వీధి రౌడీలు, శాంతి భద్రతలు ఉండవని అంటున్నారు.  ఏపీని గంజాయి రాజధానిగా తీర్చి దిద్దుతారు అని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో చూస్తే ఏపీలో రౌడీల దాడులు ఏమైనా జరిగాయా? శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందా? ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగిపోయాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. కానీ వైసీపీ పై దుష్ర్పచారం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందనే విమర్శలు ఉన్నాయి.


గతంలో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. దానికి ప్రతీకారంగా జగన్ శ్రీనుని కానీ.. ఆయన కుటుంబ సభ్యులను కానీ ఎవర్నీ ఇబ్బందులకు గురి చేయలేదు. కానీ టీడీపీ వారిని చేరదీసి వారి పార్టీ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా విజయవాడలో గులకరాయితో సీఎం జగన్ పై దాడి జరిగింది. భవిష్యత్తులో జగన్ రెండో సారి అధికారం చేపడితే వీరిపై ప్రతీకార చర్యలు ఏమైనా ఉంటాయా అంటే ఉండవనే చెప్పవచ్చు.


ఎందుకుంటే జగన్ తాతా రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు. కానీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు ఫ్యాక్షన్ రాజకీయాలను నియంత్రించగలిగారు. అదే బాటలో పయనిస్తున్న సీఎం జగన్.. ఈ ఐదేళ్లలో ఎప్పుడు కూడా ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం లాంటివి చేయలేదు. కనీసం వారిపై ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మళ్లీ జగన్ వస్తే ఏదో జరిగిపోతుంది అనే భ్రమను కల్పిచడం తప్ప.. ఏపీ లో ఏమీ జరగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: