కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో  వర్తమాన రాజకీయ అంశాలపై తనదైన కోణంలో విశ్లేషిస్తుంటారు. ఇందులో ఆయన ఇసుమంతైనా చంద్రబాబుకి నొప్పి తగలనీయరు. ఆయన సలహాలు, సూచనలు, ప్రశ్నలు అన్నీ ప్రత్యర్థులకే. ముఖ్యంగా వైసీపీ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆయన వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించారు. అనుబంధం, ఆప్యాయత అంతా బూటకమని బాబాయ్ హత్య కేసు ఉదంతం చూస్తేనే అర్థం అవుతుంది. జగన్ కు డబ్బు, అధికారం ముఖ్యం తప్ప కుటుంబం, మనసు మమతలు కాదంటూ చెప్పకనే చెబుతున్నారు.


మరీ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఆయన నుంచి సీఎం పదవిని, పార్టీని లాక్కొన్నప్పుడు ఈ కుటుంబ విలువలు ఏమయ్యాయి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనుబంధం, ఆత్మీయత విషయానికొస్తే జగన్ మాతృమూర్తి విజయమ్మపై వివేకానంద రెడ్డి పోటీ చేసి ఓడించాలని ప్రయత్నించినా.. మన్నించి జగన్ ఆయనకు రాజకీయ ఆశ్రయం కల్పించారు. నాటి హిట్లర్ మాదిరి ఇప్పుడు ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారు. తన పేదల పెన్నిదినని.. మీ జీవితాలు బాగు పడాలంటే తిరిగి మరోసారి అధికారం ఇవ్వాలని జగన్ కోరుతున్నారు.


హిట్లర్ కూడా తనకు అధికారం ఇస్తే  మీ జీవితాలను బాగు చేస్తానని చెప్పి వారి బతుకులను నాశనం చేశాడు. అయినా ఆయన్ను చాలా మంది నమ్మారు. ఇప్పుడు జగన్ ని కూడా అదే విధంగా కొంతమంది ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. అంటే జగన్ ఆదరణ తగ్గలేదని ఆర్కే నమ్ముతున్నారా? పేదల కోసం పనిచేస్తున్నానని చెబుతున్న జగన్ ..  మేం ఇంకా ఎందుకు పేదలుగా మిగిలిపోయాం అని తిరిగి వారు సీఎంను ప్రశ్నిస్తే ఏ సమాధానం చెబుతారు. మరి గతంలో చంద్రబాబు కూడా గతంలో పరిపాలించారు. ఆ సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు రాలేదు. మొత్తంగా చంద్రబాబుని సీఎం చేసేందుకు ఇలాంటి కొత్త పలుకులు ఎన్నైనా పలుకుతారు. మరి జనం విశ్వసిస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: