టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభించారు. 26 జిల్లాల్లో 26 మినీ మహానాడులు నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. దీన్ని అనకాపల్లి జిల్లాతో ప్రారంభించారు. చోడవరంలో ఈ మేరకు మొదటి మినీ మహానాడు నిర్వహించారు. అయితే.. ఈ సభలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రసంగం చాలా వివాదాస్పదం అయ్యింది. ఇటీవల అయ్యన్నపాత్రుడు.. అనేక మీటింగుల్లోనూ నేరుగా బూతులు మాట్లాడేస్తున్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని.. దొం.. నా.. డుకు.. అంటూ మాట్లాడేస్తున్నారు.


అప్పుడప్పుడు ఆయన ఫార్వార్డ్ చేసే వాట్సప్‌ వీడియోల్లో ఇలాంటి బూతులు ఇటీవల సహజంగా మారాయి.. చివరకు ఇప్పుడు సాధారణ బహిరంగ సభల్లోనూ బండ బూతులు మాట్లాడేస్తున్నారు అయ్యన్న పాత్రుడు.. అలాంటి చిల్లర డైలాగులను చంద్రబాబు కూడా నియంత్రించే పని చేయడం లేదు. అదేదో ఘన కార్యంగా సమర్థించుకునే ప్రయత్నం టీడీపీ నుంచి జరుగుతోంది. ఇప్పుడు ఈ వైఖరి విమర్శల పాలవుతోంది. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను, మంత్రులు, వైయస్‌ఆర్‌ సీపీ నేతలను తిట్టిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నాడని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.


చంద్రబాబు పైకి పెద్ద మనిషిలా నాటకం ఆడుతూ ఎవరు ఎక్కువ తిడితే వారికి మార్కులు వేస్తాననే దుర్మార్గపు వైఖరితో చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసి.. ఆ ప్రాంతానికి వెళ్లి మాట్లాడుతున్నందుకు సిగ్గుగా లేదా అంటూ  ప్రశ్నిస్తున్నారు. మందు తాగితే గానీ మాట కూడా రాని మ్యానిఫ్యాక్చరింగ్‌ డిఫెక్ట్‌ ఉన్న అయ్యన్న పాత్రుడుతో చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు, పచ్చి బూతులు తిట్టిస్తున్నాడని వైసీపీ మంత్రి అమర్‌నాథ్‌ విమర్శించారు.


చోడవరం సభలో అయ్యన్న పాత్రుడి మాటలు విన్న మహిళలు జన్మలో టీడీపీకి ఓటు వేయరని మంత్ర అమరనాథ్ అంటున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తల కొరతతో టీడీపీ మినీ టీడీపీగా తయారైందని మంత్రి మండిపడ్డారు. మరి ఇకనైనా అయ్యన్నపాత్రుడు జాగ్రత్త పడతారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: