సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఏపీఎస్‌ ఆర్టీసీ 6400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణబస్సుల్లో వసూలు చేసే  చార్జీలనే  వసూలు చేయనున్నారు. జనవరి  6  నుంచి 18వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లో  ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఒకేసారి రాను పోను టికెట్లు బుకింగ్ చేసుకుంటే 10శాతం రాయితీ ఇవ్వనున్నారు. గత ఏడాది నవంబర్ నాటికి ఆర్టీసీకి 2623 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది నవంబర్ పూర్తయ్యే సరికి సంస్థకు  3866కోట్లు ఆదాయం వచ్చింది.


సంస్థలో 62 స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీప్ ర్ బస్సులను ప్రవేశపెట్టారు. వచ్చే మార్చి నాటికి కార్గో ద్వారా 165 కోట్లు ఆదాయం తేవడమే లక్ష్యమని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు.  అన్ని బస్సుల్లో ఈ నెలాఖరుకు యూటీఎస్‌ టిమ్ మిషన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు 191 మంది కారుణ్య నియామకాలు ఇచ్చారు. మిగిలిన వారందరికీ క్రమంగా కారుణ్య నియామకాలు ఇస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు  అన్నారు. ఆర్టీసీ ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని ఎండీ స్పష్టం చేశారు.  


ఆర్టీసీ ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు  తెలిపారు. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు  స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో  ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కోసం కేటాయించినట్లు తమ  దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు  తెలిపారు. ఆ స్థలం  ఆర్టీసీకి గతంలో ఏపీఐఐసీ కేటాయించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు  తెలిపారు.


ఆర్టీసీ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ,ప్రభుత్వంపై ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు  అన్నారు. స్థలం కేటాయింపు విషయం తెలియగానే తాము తీవ్రంగా నిరసన తెలిపామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు  అన్నారు.  ఆర్టీసీలో 12లక్షల కిలోమీటర్లు పైన తిరిగిన బస్సులు 4 వేల వరకు  ఉన్నాయి. వీటిని ఎలా రీ ప్లేస్ చేయాలనే విషయమై చర్చిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: