చంద్రబాబు 2024 ఎన్నికల దిశగా బలంగా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పవన్ బస్సు యాత్రతో, మరోవైపు  లోకేష్ పాదయాత్రలతో తన వ్యూహాన్ని పన్నుతున్నారు. ఇక తన బావమరిది బాలకృష్ణ తన సొంత పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి అండగా ఎప్పుడూ ఉంటారు. ఎన్నికల ముందు ఒకడిగా మారిన చంద్రబాబు ఇపుడు కమ్యూనిస్టులను కూడా తన వైపుకు తిప్పుకున్నాడు.  జనసేన దృష్టి తన వైపు పాజిటివ్ గా ఉండేలా చూసుకోగలిగాడు.  


చంద్రబాబు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటే , జగన్ చేసే పని మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని వర్గాల నుంచి మద్దతు పొందిన వైఎస్సార్సీపీ పార్టీ దాన్ని కాపాడుకోలేకపోయింది. సరిగ్గా చంద్రబాబు  దాన్నే తెలివిగా క్యాష్ చేసుకున్నాడు. గతంలో 2019 ఎలక్షన్స్ కు ముందు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీని అధికార పక్షంలో ఉన్న టిడిపి తో సహా మిగిలిన పార్టీలు కూడా.. విమర్శిస్తూ ఉండేవి. ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీని అవి వదలడం లేదు. అంటే అధికారపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీని మాత్రం విమర్శించడం మానడం లేదు మిగిలిన పార్టీలు.


2018లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే అది ఆయన రాజకీయ చతురత. చంద్రబాబు ఆయనకు అనుకూలంగా ఉండేవారిని  ఎక్కువ మంది ఉండేలా ఆయన చూసుకుంటారు. అలా తయారు చేసుకుంటారు . అనుకూలంగా లేనివారిని తగ్గించుకుంటూ పోతారు. ఇదివరకు ఆయనకి రాజకీయ పరిపాలన రాదని విమర్శించిన పవన్ కళ్యాణ్ ని కూడా ఇప్పుడు ఇంచుమించు తన వైపు తిప్పుకున్నారు చంద్రబాబు.


పవన్ కళ్యాణ్ తో పాటు అప్పుడు విమర్శించిన మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఇప్పుడు తన వైపుకు తిప్పుకున్నారు వైఎస్సార్సీపీ కాకుండా.. వారు వైఎస్సార్సీపీ వైపు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. మరి చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ 2024 ఎన్నికల ఫలితాలలో టిడిపికి విజయాన్ని రుచి చూపిస్తుందో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: