
మిగిలిన సామాజిక వర్గాలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలతో పనులు చేయిస్తూ ఆ పైన చెప్పుకున్న రెండు సామాజిక వర్గాలు ఇచ్చిన డబ్బులతో సక్రమంగా నడుపుతూ ఇలా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఇప్పుడు వాళ్లతో పోటీపడే సామాజిక వర్గంగా మారారు. అంతా బానే ఉంది కానీ వాళ్లతో పోటీ పడటం ఈ రెండు సామాజిక వర్గాలకి నచ్చడం లేదు. అందుకే వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులైనా , మూడో వర్గం కొత్తగా పోటీకి వస్తుందని తెలిసే సరికి కలిసిపోతారు. కాపుల విషయంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకమవుతున్నట్టు కనిపిస్తుంది. వెలమ వర్గం కూడా వీరికి తోడవుతుందనే వాదన ఉంది.
పవన్ కళ్యాణ్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వకుండా చూడటానికి టిఆర్ఎస్ ఆంధ్ర ప్రదేశ్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధమవుతోందన్న వాదన ఉంది. రెడ్డి ఇంకా కమ్మ వర్గానికి 6 నుంచి 7శాతం మాత్రమే ఓట్లు ఉంటే, కాపు వర్గానికి ఇక్కడ18 నుండి 22శాతం ఓట్లు ఉంటాయి. కాపుల్లో ఎన్ని తెగలున్నా వాళ్ళందరూ కూడా మేమంతా కాపే అని అంటారు. వాళ్లను విభజించడానికి ఇప్పుడు గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు ఆ రెండు వర్గాల వారనే వాదన ఉంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ తోట చంద్రశేఖర్‌ను ముందుకు తీసుకువచ్చిందని అంటున్నారు. చూద్దాం ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఈ ఎత్తుగడను ఎలా ఎదుర్కొంటుందో?