
దాదాపు 3000 మంది అల్లరి మూకలు ఈ నిరసనలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని చెదరగొట్టేందుకు సుప్రీం కోర్టు వద్ద భద్రత దళాలు హెలిక్యాప్టర్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇంతటి అరాచకం జరుగుతుంటే బొల్సినరో కడుపునొప్పితో హాస్పటల్లో చేరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బోల్సినార్కు 49 శాతం ఓట్లు ప్రస్తుత అధ్యక్షుడు అయినటువంటి లుయిజకీ 51 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అవినీతి జరిగిందని ఎన్నికలు రద్దు చేయాలని బొల్సినారో వర్గం మద్దతుదారులు చేపట్టిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
ఈ ధర్నా చేపట్టిన వారు ఈ ఆందోళనకు దిగిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని వారందరూ శిక్ష అనుభవించక తప్పదని బ్రెజిల్ అధ్యక్షుడు హెచ్చరించారు. గతంలో ఇదేవిధంగా అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు కూడా చేసిన విధ్వంసం అందరికీ గుర్తుండే ఉంటుంది. మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడికి సూచించారు మనకు తెలిసి మనలాంటి ప్రజాస్వామ్య దేశం ఎక్కడ లేదు. ఇలాంటి దేశాల వారు ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుంది. పాటిస్తే మరీ బాగుంటుంది. ఏదేమైనా బ్రెజిల్ లో జరిగిన విధ్వంసం ఆ దేశానికి మాయని మచ్చగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.