
ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లోని సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కె.ఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేశారు. ఆరోగ్య శ్రీ అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కియోస్కులను ఏర్పాటు ను కూడా జనవరి 26 నాటికి పూర్తి చేయాలని కె.ఎస్ జవహర్ రెడ్డి సూచించారు. విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఈ మార్చి మాసాంతానికల్లా పూర్తిచేయాలని సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను క్లైయిమ్ చేసేందుకు, పెండింగ్ లోనున్న పలు బిల్లులను చెల్లించేందుకు ఆర్థిక సంఘం నిధులు రూ.275 కోట్లను ఈ నెలాఖరు కల్లా విడుదల చేయాలని సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి సూచించారు.
అలాగే ఆరోగ్య సేవలు , ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి సారూప్యత ఉన్న బడ్జెట్ హెడ్ లను విలీనం చేయాల్సిందిగా సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి సూచించారు. ఆస్పత్రుల్లో పారిశుద్య నిర్వహణతో పాటు డైట్, తాగునీరు, విద్యుత్, లాండ్రీ సర్వీస్ చార్జీల చెల్లింపునకు అవసరమైన అదనపు నిధుల మంజూరుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మహాప్రస్థానం వాహనాలతో పాటు 104, 108 అంబులెన్సు సేవల నిర్వహణ బాధ్యతలను ఎన్.జి.ఓ.లకు అప్పగించే విధంగా చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డి సూచించారు.