
రష్యా ఆయిల్ ను సౌదీ అరేబియా అమ్ముతుంది. సౌదీ అరేబియా ఒక పక్క అమెరికా శత్రువైన రష్యా తో స్నేహం చేస్తూ, మరో పక్క చైనా తో కూడా సత్సంబంధాలు కలుపుతుంది. జింపింగును మొన్న సౌదీ అరేబియాకు పిలవడమే దానికి పెద్ద ఉదాహరణ. దాంతో గ్యాసోలిన్ మీద దెబ్బ పడింది, ఇంకా మధ్య తరహా పరిశ్రమలకు మీద కూడా దెబ్బ పడింది. దాంతో కంగు తిన్న అమెరికా, ఇప్పుడు నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో పడింది. తిరిగి సౌదీ అరేబియాతో స్నేహపూర్వకంగా చర్చలు జరపడం మొదలుపెట్టింది.
వాషింగ్టన్ ఇంకా రియాద్ లకు ఇరాన్ బద్ధ శత్రువు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని దానితో మితృత్వానికి మళ్లీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అమెరికా బద్ధ శత్రువు అయిన రష్యాతో ఇరాన్ ఇప్పటికే స్నేహం చేస్తుంది. దానికి అనుగుణంగా ఇరాన్ ను ఇజ్రాయిల్ ద్వారా తనకు సన్నిహితంగా చేసుకోవాలని సౌదీ అరేబియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతే కాకుండా దుబాయ్ తో ఇంటిలిజెన్స్ అవగాహన ఒప్పందానికి సిద్ధం అవుతుంది.
అమెరికన్ కాంగ్రెస్‌లో సౌదీ ఇంటెలిజెన్స్ సాయానికి సంబంధించి ఆపిన బిల్లును మళ్లీ పునరుద్ధరణ దశగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ లో మహమ్మద్ బిన్ సల్మాన్ పై చర్యలను కూడా అమెరికా ఆపివేసింది. డిసెంబర్లో ఇరాన్ సౌదీ అరేబియాపై అటాక్ చేస్తుందన్న విషయం దానికి ముందుగానే చెప్పి తన స్నేహాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది.