
అక్కడ ఒక అమ్మాయి పెద్దమనిషి అయితే బయటికి వెళ్లకపోవడమే చాలావరకు బెటర్. ఎందుకంటే వారు అమ్మాయిలను ఎత్తుకుపోవడం, లేదా ఎత్తుకుపోయి రేప్ చేయడం, అదీ కాదంటే తమకు మూడవ పెళ్ళాం క్రిందో, నాలుగో పెళ్ళాం క్రిందో చేసుకోవడమో చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులను ఇంకా కుటుంబ సభ్యుల్ని కూడా మతం మారమని బలవంతం చేస్తారు, మారకపోతే అమ్మాయిని, కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటారు లేదా చంపేస్తారు. ఇంత జరుగుతున్నా మత పెద్దలు కూడా వారికే సపోర్ట్ చేస్తారు అక్కడ.
మొన్నటి వరకు ఈ వ్యవహారం పెళ్లి కాని అమ్మాయిల వరకు మాత్రమే జరిగితే, తాజాగా పెళ్ళైన ఆడవారిపై కూడా జరగడం సంచలనం సృష్టిస్తుంది. మతం మారనందుకు ముగ్గురు వ్యక్తులు ఒక వివాహితను అత్యాచారం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ నుండి ఒక వివాహిత హిందూ అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఇస్లాం మతంలోకి రావడానికి నిరాకరించిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసారు. ఉమ్ర కౌర్ జిల్లాలోని సమరో పట్టణంలో ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో ఇంకా వారి మరొకరు సహచరుడు కలిసి ఆమెను అత్యాచారం చేసారు. న్యాయం కోసం బాలిక మరియు ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ఆందోళన చేస్తున్నా వారికి ఇంకా న్యాయం జరగలేదని అక్కడ స్థానిక హిందూ నాయకుడు ఒకరు అన్నారు.