ప్రజలు తిరస్కరించిన సరే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనితో బిజెపి నైతిక విలువలు కోల్పోతున్న ప్రజాస్వామ్యబద్ధంగా కట్టబెట్టినటువంటి విలువలని కూడా తుంగలో తొక్కినట్టు చేస్తుంది. మేయర్ ఎన్నికను అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించి పూర్తిగా అనైతిక చర్య. ఢిల్లీలో మొన్న ఎన్నికలు జరిగాయి.


అంతకుముందు కార్పొరేషన్ లో బిజెపి దే హవా కానీ మొన్నటిసారి ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఓడిపోయిన తర్వాత దాని అంగీకరించాల్సిన బిజెపి రకరకాల కారణాలతో మేయర్ ఎన్నికకు అడ్డుగా వస్తుంది. నగరపాలక సంస్థ నిర్వహించాల్సిన మేయర్ ఎన్నికను బిజెపి అడ్డుకోవడంతో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కౌన్సిలర్లు నిరసన చేపట్టారు.ఎన్నికైన సభ్యులను ముందుగా ప్రమాణ స్వీకారం చేయించకుండా నామినేటెడ్ పదవులు ఉన్నటువంటి వ్యక్తులను ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు.


దీనిపై ఆప్ కౌన్సిలర్లు సభలోనే బైఠాయించారు. అక్కడ రభస చోటు చేసుకుంది. భాజపా కౌన్సిలర్లు ఆప్ కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకున్నారు. తోపులాట జరిగింది. ఇప్పటికీ జనవరి 6న మొదటిసారి జరిగిన సమావేశం ఇలాంటి రభసతోటే ఎలాంటి ఎన్నిక జరగకుండా వాయిదా పడింది. మరోసారి ఎన్నిక నిర్వహించాల్సినప్పటికీ భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల మధ్య నినాదాలు వివాదాలతో అక్కడ పూర్తి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


దీంతో ప్రిసైడింగ్ అధికారి  సభను వాయిదా చేశారు. బిజెపి పై ఆమ్ ఆద్మీ కౌన్సిలర్లు నాయకులు ఆరోపణలు చేశారు. పూర్తి మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నప్పటికీ కౌన్సిలర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తూ ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఏదేమైనా ప్రజాస్వామ్య జీవితంలో గెలిచినవారు ఎన్నిక కావడానికి అర్హులు. కానీ బీజేపీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP