
ఒక మానవ బాంబు దాడి 200 మంది సైనికులను తప్పించుకొని జరగడం అసాధ్యం. అక్కడ ఉన్న సైన్యం లోని ఎవరైనా ఖచ్చితంగా సహకరించి ఉండాల్సిందే. అంటే పెషావర్ లో జరిగిన బాంబు దాడి పాక్ సైన్యానికి కచ్చితంగా ఏదో లింకు ఉండి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇరాక్ సిరియా లాంటి పరిస్థితులు పాక్ లో వచ్చే పరిస్థితి ఉంది. సిరియా, పాలస్తీనా, ఇరాక్ దేశాలు ఇస్లాం రాజ్యమే. ఇస్లాం దేశాలు అయినప్పటికీ అక్కడ చాలా బాంబుదాడులు జరుగుతున్నాయి. అసలు అలా జరగకూడదు కానీ జరుగుతున్నాయంటే ఒక రకమైన విభేదాలను వారిలో వారు సృష్టించుకుంటున్నారు.
ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్లో సైన్యం పాలన వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. పాకిస్తాన్లో సైన్యానికి ప్రభుత్వానికి పడటం లేదని అది ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియడం లేదు. బాంబు దాడిలో సైనికుల పాత్ర లేనిది అంత పెద్ద దాడి జరగదు. పాక్ లో ఏదో కుట్ర జరుగుతుందన్న సంకేతాన్ని తెలుపుతుంది. పాక్ ప్రభుత్వం సైనికులు ఈ ఘటనపై ఏ విధంగా స్పందిస్తారు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనేది చూడాలి. మొత్తం మీద ఈ బాంబు దాడిలో 112 మంది చనిపోవడం 300 మందికి పైగా గాయాలవ్వడం తీవ్ర విషాదాన్ని నింపింది. పాకిస్తాన్లో ఇంకా ఎలాంటి దారుణ పరిస్థితులు వస్తాయో చూడాలి.