ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలను చుట్టేయడంలో బిజీ బిజీగా గడుపుతుంటారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత భారతదేశ విదేశాంగ విధానం దూకుడుగా వ్యహరించడానికి కారణం విదేశాంగ మంత్రి జైశంకర్ అని చెప్పొచ్చు. అదే సమయంలో దుబారా ఖర్చులు లేకుండా ప్రయాణాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో విదేశీ పర్యటనలు చేసిన విదేశాంగ మంత్రులు అక్కడి మీడియాకు డబ్బులిచ్చి వార్తలు అనుకూలంగా రాయించుకునే వారు. వాటి బిల్లులను ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకునేవారు.


ఇప్పుడు జై శంకర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. భారతదేశ చరిత్రలో ఈయన కేవలం మూడు సంవత్సరాల్లో 86 సార్లు విదేశాల్లో పర్యటించారు. ఇలా పర్యటించిన ఏకైక విదేశాంగ మంత్రి జై శంకర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 86 దేశాల్లో పర్యటిస్తే అందుకు అయిన ఖర్చు కేవలం రూ. 20.87 కోట్లు. చాలా మంది సరదాగా యూరప్ ట్రిప్ లు వెళ్లి వచ్చే వారికి ఒకసారి అయ్యే ఖర్చు ఈయన 86 సార్లు తిరిగినా కాలేదంటే ఎంతటి నిజాయతీ పరుడో అర్థం చేసుకోవచ్చు.


ఈయన నిరాడంబరంగా ఉంటూనే ఎన్నో విదేశాల్లో తిరిగి భారత దౌత్య విధానాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ దేశం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి విదేశాంగ వ్యక్తి కావడం వల్ల భారత్ కు దౌత్య మార్గాల్లో విజయం ఓ వైపు వస్తుంటే మరో వైపు డబ్బులు కూడా ఆదా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ 21 సార్లు విదేశాల్లో పర్యటించారు. జపాన్ కు రెండు సార్లు, యూఎస్ కు రెండు సార్లు వెళ్లి వచ్చారు. రాష్ట్రపతి కూడా ఎనిమిది సార్లు విదేశీ పర్యటన చేశారు. దీనికి రూ.6.24 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: