ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ కు 30 దేశాలు సపోర్టు చేస్తున్నాయి. అది యుద్ధానికే మొగ్గు చూపుతోంది. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అనుకుంటూ పోరాటం చేస్తూనే ఉంది. రష్యా మాత్రం యుద్ధంలో నెగ్గి తీరతాం. ప్రపంచం అంతా ఒకవైపు వచ్చినా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకుంటాం అనే పట్టుదలను కొనసాగిస్తుంది. ఇలాంటి తరుణంలో యుద్ధం ఆగేలా లేదు. యుద్ధం ఆగితే బాగుంటుందని ప్రపంచ వ్యాప్తంగా కోరుకుంటున్నారు. మరి ఎప్పటికీ ఇదే విధంగా కొనసాగుతుందా అనుకుంటే అది పొరపాటే.


రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మూడు సార్లు హత్యాయత్నం జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రస్తుతం ఎవరికీ కనిపించకుండా దాక్కుంటున్నాడు. కారణం ఈయన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఉన్న సమాచారంతో రహస్య ప్రాంతంలో ఉంటున్నారు. ఇదే సమయంలో ఆయన లైవ్ ఇస్తున్నటువంటిది కూడాా అవాస్తవం. ఎక్కడో రికార్డు చేసి దాన్ని లైవ్ లో ఇస్తున్నట్లు చేస్తున్నారు.


హత్య ప్రయత్నాలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెన్నెట్ గత మార్చిలో మాస్కోలో రష్యా అధ్యక్షుడితో భేటి అయ్యారు. యుద్ధాన్ని ఆపాలని శాంతి చర్చలను జరిపారు. ఈ సమయంలో పుతిన్ ను బెన్నెట్ అడిగారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని మీరు చంపాలని అనుకుంటున్నారా అని.. దీనికి ఆయన అలాంటిదేమీ లేదని చెప్పారని బెన్నెట్ అన్నారు.


ఆ సమయంలో నాటోలో మేం చేరాలనుకోవడం లేదు. యుద్ధాన్ని ఆపాలని కోరాలని బెన్నెట్ తో ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు చెప్పించారు. అనంతరం ఉక్రెయిన్ మాట మార్చడంతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. మొత్తం మీద ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపాలన్నది తమ అభిమతం కాదని ఉక్రెయిన్ లో ఉంటున్న రష్యా  మాట్లాడేవారి హక్కులను కాపాడటం, నాటో దేశాలు ఇక్కడ తిష్ట వేయకుండా చూడటం తమ ప్రధాన లక్ష్యమని మాస్కో నోట పదే పదే వినిపిస్తున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: