
డ్రాగన్ దేశం ఒక బెలూన్ పంపిస్తే దాన్ని చూస్తూ యూఎస్ ఊరుకుంటుందా.. ఇంత జరుగుతున్నా వేరే దేశంలోకి చొరబడ్డ దాన్ని పేల్చేస్తే తప్పు అని భావిస్తోంది చైనా. ఈ బెలూన్ అమెరికాలోని దక్షిణ కరోనిలా లోని అట్లాంటిక్ సముద్రంలోకి చేరింది దీంతో పెంటగాన్ నుంచి ఆదేశాలు అందగానే యద్ధ విమానాలతో దాన్ని సముద్రంలో పేల్చేశారు. దీంతో ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా సాపీగా ఆ పని చేశారు.
అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.39 గంటలకు తీరానికి ఆరు నాటికల్ మైళ్ల దూరంలో దీన్ని పేల్చేశారు. బెలూన్ శకలాలు సముద్రంలో 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడిపోయాయి. చైనా ఇది మేం కావాలని చేసింది కాదని వాదిస్తోంది. కానీ అది అమెరికా ప్రజలకు నచ్చలేదు. మరో దేశంలోనికి ఇలాంటివి పంపించడం అది ఆ దేశానికి తెలియకుండా వారి సార్వభౌమత్వానికి సవాలు చేసింది. ఇలాంటి వి మరోసారి చేస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించింది.
ఇంత చేసినా చైనా మాత్రం ఇంకా తనను తాను సమర్థించుకుంటూనే ఉంటుంది. మేం కూడా అమెరికాకు సంబంధించినవి ఇలాంటివి వస్తే పేల్చేస్తామని చైనా ప్రకటించింది. తప్పు చేయడం ఎదుటి వారి మీద నిందలు వేయడం చైనాకు అలవాటుగా మారిపోయింది. ఈ గొడవ రెండు పెద్ద దేశాల మధ్య చినికి చినికి గాలివానగా మారుతుందా చూడాలి.