
బెంజిమన్ నెతన్యాహు ప్రెంచి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలతో పాటు ఐరన్ డోమ్ ఇచ్చేందుకు తాము సిద్ధపడుతున్నామని చెబుతూనే ఇంకా ఏటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ఎందుకంటే ఉక్రెయిన్ వద్ద నున్న ఐరన్ డోమ్ దాదాపు 90 శాతం వరకు సక్సెస్ పుల్ గా పని చేస్తుంది. విదేశాల దాడులను తిప్పి కొట్టడంలో ఒక గొప్ప ఆయుధం.
కానీ రష్యా ఇజ్రాయిల్ ను హెచ్చరించింది. ఉక్రెయిన్ కు ఐరన్ డోమ్ గానీ యుద్ధ సామగ్రి కానీ అందిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పింది. కానీ ఇజ్రాయిల్ కు అమెరికాకు ఉన్న అనుబంధంతో అగ్రరాజ్యం చెప్పిన తర్వాత తప్పక ఇవ్వాల్సిందే. మరి ఐరన్ డోమ్ ఉక్రెెయిన్ వద్దకు చేరితే రష్యా ఊరుకుంటుందా? ఇజ్రాయిల్ పై దాడి చేస్తుందా.. రష్యా ఎలా స్పందిస్తుందనేది చూడాలి. రష్యా, ఉక్రెెయిన్ యుద్ధం ఏమో గానీ ఇజ్రాయిల్ కు మధ్యలో తలనొప్పి ఎదురవుతోంది. ఇస్తే ఒకరితో బాధ, ఇవ్వకపోతే ఇంకొకరితో వైరం. ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది ఇజ్రాయిల్ పరిస్థితి.