అమెరికాలో నాలుగైదు రోజులు ప్రయాణించిన చైనా బెలూన్ ను మొన్ననే అగ్రరాజ్యం కూల్చేసింది. అది 60, వేల అడుగుల ఎత్తులో ఉండగా సముద్ర గగన తలంలో పేల్చేసింది. ఇందులో మరోక కోణం ఏమిటంటే ఇంకో బెలూన్ లాంటి ఆకారం గల ఒక వస్తువు అమెరికా గగన తలంలోకి ప్రయాణించింది. దీంతో పౌర విమానాలు తిరిగడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇది అలాస్కా ప్రాంతంలో ప్రయాణించినట్లు గుర్తించారు.


కానీ అమెరికాలో  ఇలాంటివి గతంలో కూడా ప్రయాణించాయని ప్రకటించారు. దీంతో అవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే మీరేం చేస్తున్నారని అక్కడి ప్రజలు అమెరికా ప్రభుత్వాన్ని,సైన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మరో అనుమాస్పద వస్తువు అలాస్కా ఉత్తర తీర ప్రాంతంలో కనిపించింది. దీన్ని వెను వెంటనే పేల్చేశారు. ఇది 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని దీన్ని గుర్తించిన వెంటనే పేల్చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సమాచారం అందగానే వెంటనే కూల్చివేయమన్నట్లు ఆదేశాలు ఇచ్చినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎప్ 22 యుద్ధ విమానంతో ఆ వస్తువును పేల్చేసినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇటీవల తమ గగనతలంలోకి వచ్చిన  వస్తువును చైనా బెలూన్ గా గుర్తించారు. కానీ ఇప్పుడు కూల్చేసిన వస్తువు శకలాలను గుర్తిస్తే కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు.  


తాజాగా కనిపించిన వస్తువు చిన్న కారు సైజులో ఉందని మొన్నటి చైనా బెలూన్ తో పోల్చితే ఇది చాలా చిన్నదని చెప్పారు. మొన్నటి  చైనా బెలూన్ మాత్రం కచ్చితంగా సమాచారాన్ని సేకరించేందుకు వచ్చిందేనని తేల్చారు. ఇప్పుడు వచ్చిన వస్తువు దేని గురించి వచ్చిందో తెలుసుకోవాల్సి ఉందని అమెరికా ప్రకటించింది. మరి అగ్రరాజ్యంలోకి చొరబడి ఇంత యథేచ్చగా ప్రత్యర్థి దేశాల రహస్య వస్తువులు గగన తలంలో ప్రయాణిస్తున్నాయంటే అమెరికా నిఘా పరంగా విఫలమవుతున్నట్లే లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: