
ఒకప్పుడు సిక్కులు ప్రాణాలు కోల్పోతుంటే హిందువులు మొట్టమొదటి సంతానం సిక్కులకు ఇవ్వబడతారని చెప్పిన విషయాన్నివీరు పూర్తిగా మరిచిపోతున్నారు. సిక్కు రాజుల కొడుకులు విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం రాజుల చేతుల్లో చనిపోతే ఆనాడు భారత్ లో హిందువులు సిక్కులకు అండగా ఉన్నారు. పాత తరపు లెక్కలు చెప్పే చరిత్ర మన వద్ద లేదు. ఆ విషయాన్ని ప్రస్తుతం అందరూ మరిచిపోయారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ చెప్పే అబద్దాలను ఖలిస్తాన్ వేర్పాటు వాదులు బలంగా నమ్ముతున్నారు. భారతదేశం మీద హిందుత్వం మీద కొంత మంది సిక్కులు పెంచుకుంటున్న ద్వేషం తీవ్రతరమవుతోంది. దాని పర్యవసానమే ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు జరగడం.
దీనిపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విషయంపై హెచ్చరించారు. ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను తక్షణమే అడ్డుకోవాలని ఎవరైతే ఆ దాడుల్లో పాల్గొన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అదే విధంగా ఈ విధమైన చర్యలతో భారత్ ని కానీ ఇక్కడ మత విశ్వాసాలను ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. ఇలాంటి ఉగ్రవాద ముఠాలను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల గురించి ఇప్పటికే వివిధ దేశాలకు భారత్ సమాచారం అందించింది. వీరిని ఉగ్రవాదులుగా ప్రకటించామని ఇప్పటికే ఆయా దేశాలకు చెప్పింది.