ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం ధర్మాసనం వద్దకు వెళ్లకపోతే ఆంధ్రలో ఉన్న భూములన్నీ కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. గ్రామ కంఠం భూములు అంటే పంచాయతీ కిందకు వస్తాయి. ఏ లెక్కన లేని భూములను గ్రామ కంఠం భూములుగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో గ్రామ కంఠం భూముల్ని ఆక్రమించుకుని షాపులను కట్టేసుకున్నారు.


ఇలా గ్రామకంఠం భూమిలో నిర్మించుకున్న వారికి పంచాయతీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులతో ఆ ప్రాంతంలో షాపులు కట్టుకున్న వారు కోర్టుకు వెళ్లారు. అవి గ్రామకంఠం భూములే కానీ అవి గ్రామ పంచాయతీ పరిధిలోనివి కావు. అవి ఎవరికి సంబంధించినవి కావని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే గతంలో ఇచ్చిన తీర్పులననుసరించి గ్రామ కంఠం భూములు అనేవి పంచాయతీకి చెందినవి కావు. కాబట్టి ఆ ప్రాంతంలో షాపులు నిర్మించుకున్నటువంటి వారికి తిరిగి మళ్లీ అదే స్థానంలో గ్రామ పంచాయతీ షాపుల్ని నిర్మించి ఇవ్వాలని తీర్పు చెప్పింది.


అయితే ఇక్కడొక విషయం దాగి ఉంది. ఇదే విధానాన్ని గనక అందరూ పాటించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ప్రభుత్వ భూమి కూడా మిగలదు. అన్ని ప్రభుత్వ జాగల్ని కబ్జాదారులు మింగేస్తారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి షాపులు, మేడలు, ఆంతస్తులు కట్టేస్తారు. తర్వాత ఆంధ్రలో ప్రభుత్వ భూమి అనేది మిగలకుండా పోతుంది.


ఈ తీర్పును సవాలు చేస్తూ కచ్చితంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టు, లేదా సుప్రీం ధర్మాసనంలో అప్పీలు చేయాలి. ఇలాంటి తీర్పు వల్ల ప్రజా, ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యే అవకాశం ఉంటుంది. పేదవాడి భూములను కబ్జా చేసి అక్కడ ఇష్టారీతిన వ్యవహరించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూమనేది కనిపించకుండా పోతుంది. ప్రభుత్వం తీర్పుపై మళ్లీ అప్పీలు చేయాలి.  గ్రామ కంఠం భూములనేవి ప్రభుత్వ, పంచాయతీ ఆధీనంలో ఉండేలా ఏపీలో చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: