ప్రపంచంలో ప్రళయాలు కలిగినప్పుడు ఎవరం ఆపలేం. నిప్పును నీళ్లతో కంట్రోల్ చేయొచ్చు. కానీ నీటి ఉత్పాతాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు. 1970 లో దివిసీమ లో ఉప్పెన వచ్చింది. సముద్రంలో రెండు రకాల ఉత్పాతాలు ఉంటాయి. ఉప్పెన, సునామీ ఇవి రెండు వేరు వేరు. ఉప్పెన అనేది ఒక్కసారిగా రెండు తాటిచెట్ల పై అంతస్తు అంత ఎత్తులో అలలు వచ్చి కొట్టేయడం. సునామీ అంటే సముద్ర భూ గర్భంలో అగ్ని పర్వతాలు బద్ధలై ఒక్క సారిగా సముద్రం ముందుకు వచ్చేయడం. విలాయం సృష్టించడం. ఈ రెండింటిలో ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం అనేది జరుగుతుంది. ఇదంతా ప్రజలకు జరిగే నష్టం.


ప్రపంచం మొత్తం మీద 71 శాతం నీరు, 29 శాతం భూమి మాత్రమే ఉంటుంది. అయితే మంచు ఖండాలు అనేవి మానవాళిని ఏ విధంగా రక్షిస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే విపరీతమైన వేడి, వాతావరణ కాలుష్యం వల్ల అంటార్కిటికా ఖండంలోని మంచు పర్వతాలు కరుగుతున్నాయి. తాజాగా వరల్డ్ మెటాలాజికల్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన వెలువరించింది.


మళ్లీ 19 ఏళ్ల క్రితం జరిగిన పరిస్థితి ప్రస్తుతం వచ్చేలా ఉందని ప్రకటించింది. మంచు కొండలు కొంచెం కొంచెంగా కరుగుతున్నాయి. వీటి వల్ల భూభాగం రోజు రోజుకు కుచించుకుపోతుంది. నీటి శాతం పెరిగి భూమి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సునామీ, ఉప్పెన లాంటివి వచ్చినప్పుడే ప్రజలు తట్టుకోలేరు. చెట్లను నరకడం, వాహనాల వల్ల పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల తీవ్రంగా మంచు పర్వతాలు కరుగుతున్నాయి.  ప్రస్తుతం ప్రపంచంలోని మేధావులు ఆలోచన చేయాలి.  


మంచు పర్వతాలు కరగకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితులు కల్పించాలి. ప్రపంచ దేశాల్లో పర్యావరణ రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చ జరగాలి. సరైన మార్గాలు వెతికి అంటార్కిటికా ఖండంలో ఉన్న మంచు పర్వతాలు కరగకుండా చేయాలి. ఇలాగే కరిగితే భూమి అనేది వెతుకుదామంటే దొరకని పరిస్థితి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: