
మాజీ ప్రధాని మన్మోహన్ కూతురు కూడా సోరస్ కంపెనీలో పని చేస్తుందని అంటున్నారు. సోరొస్ మీడియా సంస్థల్ని సంపాదిస్తే ప్రధాని మోడీ రూరల్ డెవలప్ మెంట్ కోసం పోరాడుతున్నారు. మోడీ అర్బన్ డెవలప్ మెంట్ కోసం ప్రయత్నిస్తే సోరొస్ అర్బన్ నక్సల్స్ ను పెంచి పోషిస్తున్నారు. మోడీ హైవేలు, రోడ్లు, భవంతులు, నిర్మించాలని ప్రయత్నాలు చేస్తూ భారత్ ను అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబెట్టాలనుకుంటే సోరొస్ మాత్రం ఇండియా షేర్ మార్కెట్లు కుప్పకూలి మళ్లీ అమెరికానే ప్రపంచ దేశాల్లో ఎప్పుడూ పెద్దన్న పాత్ర పోషించేలా ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
సోరొస్ చేసిన వ్యాఖ్యలకు గతంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఘాటుగానే స్పందించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం స్పందించింది. వీరందరి లక్ష్యం ఇండియా ఎకానమీని దెబ్బతీయడం, మోడీ చరిష్మాను తొలగించడం. వీటిని ఎలాగైనా సాధించేందుకు వీరు ప్రతి క్షణం తపన పడుతుంటారు. అయితే సోరొస్ పెట్టినటువంటి సోకాల్డ్ ఎన్జీవో సోసైటీలో మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ కుతూరు, యామిని అయ్యర్ కూడా ఒక సభ్యురాలుగా ఉందని తెలుస్తోంది. ఈ సోరొస్ అనే వ్యక్తిని ఇజ్రాయిల్ కూడా ద్వేషిస్తుంటుంది. ఎందుకంటే పాలస్తీనాకు నిధులు అందజేస్తాడు. ఈయనను హంగేరి నుంచి బహిష్కరించారు. వీరు పక్కా ప్రణాళికతో మోడీని, దేశాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కుట్రలు చేస్తారని విమర్శలు వస్తున్నాయి.