
ఉక్రెయిన్ అయితే ఎక్కడ తగ్గేది లేదని శాంతి చర్చలకు ఒప్పుకోమని జెలెన్ స్కీ అంటున్నారు. రష్యా మాత్రం మా భాష, మా సంస్కృతి పట్ల ఉక్రెయిన్ చేస్తున్న అరాచకాలను కచ్చితంగా అణగదొక్కడమే తమ లక్ష్యమని చెబుతోంది. అయితే యుద్ధం వల్ల ఉక్రెయిన్ తీవ్రంగానే నష్టపోతుంది. అమెరికా ఆయుధాలు, యుద్ధ సామగ్రి మునుపటిలా కాకుండా తక్కువగానే పంపిస్తోంది. అవి కూడా ఎక్కడో మిగిలిన ఆయుధాలు పంపిస్తూ వాటిని రష్యాపై ప్రయోగించాలని అమెరికా భావిస్తోంది.
దీంతో పాము చావదు.. కర్ర విరగదు అనే సామెతను గుర్తొచ్చేలా చేస్తోంది. కొత్త ఆయుధాలు ఇవ్వకుండా పాత పాడుబడిన ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇస్తోందని అమెరికాపై ఆరోపణలు వస్తున్నాయి. వియత్నాం, క్యూబా లాంటి దేశాలను అమెరికా ఏమైనా ఆక్రమించుకుందా? పోనీ ఇరాక్, ఆఫ్గానిస్తాన్ లాంటి దేశాల్లో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించాలనుకుని ఏం సాధించింది. అక్కడ ఉన్న నిధులను, చమురును పూర్తిగా దోచుకుని ఆయా దేశాలను విడిచిపెట్టింది. కానీ ఉక్రెయిన్ లో దోచుకోవడానికి కూడా ఏమీ లేవు.
కానీ రష్యా పెడధోరణిని అడ్డుకునేందుకు అమెరికా తన అగ్రరాజ్య హోదాను నిలబెట్టుకునేందుకు ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తూ ఇంకా యుద్ధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలా ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో వేల మంది మరణిస్తున్నా ఆయా దేశాల అధ్యక్షుల పట్టు విడవని తనంతో రెండు దేశాలు ఆర్థికంగా ఎంతో కుదేలవుతున్నాయి. ఈ రెండు దేశాలే కాదు ప్రపంచ దేశాల్లోని పలు ప్రాంతాలకు ఈ యుద్దం ద్వారా ఎంతో కొంత నష్టం జరుగుతూనే ఉంది.