రష్యా, ఉక్రెయిన్ యుద్దంతో తీవ్రంగా ఇబ్బంది పడిన దేశం జర్మనీ. రష్యా నుండి అనేక కంపెనీల నుంచి అతి తక్కువ ధరకు పెట్రోల్, డిజీల్ వచ్చేది. దీంతో జర్మనీ సంపన్న దేశాల సరసన ఆర్థిక పరంగా బలమైన దేశంగా నిలిచేది. కానీ రష్యాకు సపోర్టు ఇవ్వకుండా నాటో దేశాల సరసన జర్మనీ ఉండటంతో రష్యా నుంచి పెట్రోల్, డిజీల్ ను కొనలేదు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


అమెరికా, ఇతర దేశాల నుంచి ఆయిల్ కొనడం వల్ల ఆర్థికంగా జర్మనీ చాలా నష్టపోతోంది. నాటో దేశాలు అన్నికలిపి ఉక్రెయిన్ కు ఆయుధాలను అందించాలని నిర్ణయించాయి. ఇందులో జర్మనీ ముందుగా ఉక్రెయిన్ కు ఇప్పటి వరకు చాలా ఆయుధాలను అందించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ జర్మనీని ఎయిర్ క్రాప్ట్ లను అడుగుతోంది. దీనికి జర్మనీ మాత్రం ఫైటర్స్ జెట్స్ ను అందించలేమని తేల్చి చెప్పింది.


ఇటలీ దేశం ఇస్తాం అని చెబుతుంది. కానీ వెస్టర్న్ దేశాల నేతలు ఇస్తేనే మేం ఇస్తామని ఇటలీ ప్రకటించింది. అమెరికా కూడా ఎప్ 16 ఫైటర్ జెట్ ను ఇవ్వమని చెబుతోంది. ప్రాన్స్ రఫెల్ యుద్ధ విమానాలను ఇవ్వమని చెప్పేసింది. మరి ఏ దేశం ఇవ్వాలి. బ్రిటన్ ఇవ్వాలని అనుకుంటోంది. కానీ అవి కూడా పాతకాలం నాటివి ఇచ్చేందుకు సిద్దపడుతుంటే ఉక్రెయిన్ మాత్రం ప్రస్తుతం అప్ డేట్ ఉన్న యుద్ధ విమానాల్ని ఇవ్వాలని కోరుతోంది.


అయితే ఈ యుద్ధ విమానాలు ఇవ్వడానికి చాలా దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. కాబట్టి అప్పటి లోగా రష్యా, ఉక్రెయిన్ పై భీకర దాడులతో విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ యుద్ధ విమానాలు ఇవ్వడానికి  జరిగే చర్చలు సాగదీతగా సాగే అవకాశం  ఉంది. గతంలో మేం మద్దతిస్తామని చెప్పినా యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా ముఖం చాటేస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ రష్యా కు లొంగక తప్పని పరిస్థితి ఏర్పడేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: