
దీనికి ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. తెలంగాణలో ఈ ఏడాదే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ లో జరుగుతాయా.. లేక నవంబర్లో జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 35 స్థానాల్లో వేరే పార్టీలకు అవకాశం ఇచ్చి మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేయడమే కర్తవ్యంగా బీఆర్ఎస్ పని చేస్తుంది.
బీజేపీ రాష్ట్రంలో ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక మనకు మళ్లీ అవకాశం ఉండదని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ లెక్క మాత్రం ప్రస్తుతం 40, 45 మంది అభ్యర్థులను ఇప్పటికే సిద్ధం చేసేసుకుంది. ఎన్నికల్లో ఖర్చుకు కూడా వెనకాడని వారిని రెడీగా పెట్టుకుంది. పబ్లిక్ లో పేరు ఉన్న వాళ్లు కాదు. పార్టీ పేరుతో గెలిచే వారిపై ఎక్కువ దృష్టి సారించింది బీజేపీ. మిషన్ 90 అంటూ గోల్ పెట్టుకుని ముందుకు సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం బీజేపీకి మాత్రమే లాభం అవుతుందని భావిస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు, బీజేపీలో చేరే అవకాశం ఉంటుందని భాావిస్తున్నారు.
ఒకవేళ విడివిడిగా పోటీ చేసినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు కమలనాథులు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పొత్తుకు ఒప్పుకోరని రేవంత్ చెబుతున్నారు. చూడాలి ట్రయంగల్ పోరులో రాష్ట్రంలో హంగ్ వస్తుందా.. లేక కమలం వికసిస్తుందా..?