సముద్ర మార్గంలో వేరే దేశాలకు అక్రమంగా వెళుతూ పడవలు బోల్తా పడి చాలా మంది మరణిస్తుంటారు. పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్, బర్మా లాంటి దేశాల నుంచి ఎక్కువ మంది వలస వెళ్తుంటారు. వీరిని శరణార్థులుగా పిలుస్తారు. అయితే తమ దేశాల్లో బతకడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో శరణార్థులుగా వేరే దేశాలకు పొట్ట చేత పట్టుకుని వెళుతుంటారు. కొన్ని దేశాలు మతపరమైన ఆంక్షలు, ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.


ఇలాంటి సమయంలో అక్కడ ఉండలేక బతుకుజీవుడా అనుకుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళుతుంటారు. వలస వెళ్లే వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు చట్టబద్ధంగా వెళ్లే వారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు, అమెరికా, యూరప్ లాంటి దేశాలకు ఎక్కువ జీతాలు వస్తాయని ఉద్యోగాలు చేయడానికి వెళ్లేవారు. వీరు  ఆ దేశానికి చెందిన వీసా పొంది అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి అర్హులుగా వెళతారు.


అలా కాకుండా పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మాలో దేశం విడిచి పారిపోతున్నారు. కేవలం అక్కడ అంతర్గతంగా ఎదురవుతున్న సమస్యలే కారణం. తాజాగా పాకిస్థాన్ నుంచి వలస వెళుతున్న జాతీయ హకీ క్రీడాకారిణి షాహిదా రజా వలస వెళుతూ చనిపోయింది. టర్కీ మీదుగా ఇటలీకి శరణార్థులుగా వెళుతున్న సమయంలో పడవ ప్రమాదంలో మృత్యువాత పడింది.


ఈమె టర్కీకి వెళ్లి అక్కడి నుంచి ఇటలీ వెళుతున్న సమయంలో పడవ ప్రమాదం జరిగింది. ఈమె కష్టపడి సంపాదించుకున్న 4 వేల డాలర్లను ఇచ్చి మరి శరణార్థిగా వెళుతుంటే ఘోరం జరిగిపోయింది. పాక్ లో క్రీడాకారులకు లైఫ్ లేదని ముఖ్యంగా అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండటం లేదని భావించి ఇక్కడ ఉంటే కెరీర్ నాశనం అయిపోతుందని అనుకుంది. వేరే దేశానికి వెళ్లి కనీసం స్వేచ్చగా బతకాలని అనుకున్న విధి వక్రీకరించి ఆమె ప్రాణాలు పోయాయి. చాలా దేశాల్లో కూడా  ఈ విధంగా వలస వెళుతున్న సమయంలో ఎంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: