అదానీని ఇప్పుడు అడ్డుకుంటే చాలా ఆస్తులు వేరే వాళ్ళ వశం అయిపోతాయి. వాస్తవంగా ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో  ఎక్కడైనా తీసుకుంటే మనకి ఇసుక సిండికేట్ లోనో, ఇంటికి సంబంధించిన వేలం పాటల్లోనో కొంత మంది కలిసి రింగ్ అయిపోతూ ఉంటారు. ఆ ఇంటి కాస్ట్ కోటి రూపాయలు అయితే 25 లక్షలకు బుక్ చేసుకుంటే, వేలం బిడ్ చేసుకుంటే వీళ్ళు అప్పు తీసుకునే దాన్ని బట్టి,  ఎంత మిగులుతుందనేది లెక్క వేస్తారు. 25 లక్షలు బిడ్ చేశారనుకోండి. దాన్ని 28,29 లక్షల దగ్గర క్లోజ్ చేసేస్తారు.


మిగతా వాళ్ళు ఎవరూ పాడకపోతే అంతకన్నా ఎక్కువ వచ్చింది కదా అని  క్లోజ్ చేసేస్తారు. ఇట్లాగే ఇంటర్నేషనల్ రింగ్ అయిన దాన్ని ఒకదాన్ని బెజ్జం పెట్టి మరీ సాధించాడు అదానీ. ఇతర దేశంలోని పోర్ట్స్, గనులు, విమానాశ్రయాలు  వీటికి సంబంధించిన బాండ్లు రిలీజ్ చేశారు. పలానా వ్యాపారం అంటే టైంకి డబ్బులు ఇచ్చేశారు. బాండ్లు అంటే నిర్ణీతమైన టైంకి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అనే ఒక లెక్క. ఇప్పుడు అలాంటి బాండ్లకు కనుక టైంకి డబ్బు చెల్లించకపోతే ఆటోమేటిక్ గా క్రిమినల్ కేసులు అయ్యి ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ వశం అయిపోతాయి. ఇది ఇప్పుడు ఆదాని మీద జరుగుతున్న కుట్ర.


2024 కు సంబంధించి ఇతర దేశాలలో ఉన్న అతని బాండ్లకి రెండు బిలియన్ డాలర్లకు రీపేమెంట్ జరగాల్సి ఉంది. దాన్ని అడ్డుకోవడం కోసం, అతనికి అప్పు పుట్టనీయకుండా చేయడం ద్వారా ఆయన ఆ వ్యాపారాలను వదిలేసుకుంటే దాన్ని లాక్కోవడానికి చూస్తున్నారు. ఇతను టేకప్ చేశాక అవి విపరీతమైన లాభాల్లోకి వెళ్లిపోయాయి. మొన్న ఇజ్రాయిల్ పోర్టు దగ్గరనుంచి, ఆస్ట్రేలియా బొగ్గు గనుల దాకా, అంతకుముందు దాని నుండి ఏమి రాదనుకున్న దాన్ని ఆదాయంగా మార్చేశాడు ఆదాని. ఇప్పుడు దాన్నుంచి సంపాదన వస్తుందని గ్రహించారు వాళ్లు. అందువల్ల జరుగుతున్న తంతే ఇప్పుడు అదానీ పై జరుగుతున్న కుట్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: