చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకున్నట్టుగా, ఆ ఆటలో కూడా తొండి ఆటలు ఆడినట్టుగా, ఇప్పుడు తనకోసం వచ్చిన పోలీసులను తాను ఇంట్లో ఉండి కూడా, ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో లేడు అని కోర్టుకు చెప్పించాడు. ఆ తర్వాత  దొరలా బయటకు వచ్చి భారీ ఉపన్యాసాలు ఇచ్చాడు. మన జోలికి వస్తే మామూలుగా ఉండదు, చూస్తూ కూర్చునే ప్రశ్నే లేదు, మనల్ని అరెస్ట్ చేస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదు, కావాలంటే ఎదురు దాడులు చేస్తాం, అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం, సైనికులను కూడా నిలదీస్తాం అంటూ ఘాటైన ప్రసంగమే ఇచ్చాడు.


తోషాకానా కేస్ తనకు సంబంధించిన గిఫ్టులపై వచ్చిన కేసు విషయంలో యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆ తర్వాత బెయిల్ వచ్చిన ఇమ్రాన్ దుబాయ్, సౌదీ వాచ్ లు  అమ్ముకున్నాడు అన్న ఆరోపణల మీద ఈ మధ్య ఇస్లామిక్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ విత్ డ్రా చేయడానికి అంగీకరించకపోవడం‌తో వచ్చిన గొడవ ఈ వాదపవాదాలు అయితే పూర్తయ్యాయి.


అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తన ఇంట్లోకి వచ్చిన వాళ్లు ప్రాణాంతకులని తనను చంపేయడానికి వచ్చారని, తనకు సెక్యూరిటీ పెంచమని ఒక కొత్త సెంటిమెంట్ పాయింట్ ని రేకెత్తించాడు. ఇతను ప్రతి నిమిషం రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడంతో పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలను అయితే విధించింది. ఇమ్రాన్ ఖాన్ పై బ్యాన్ ను విధించింది.


ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలకు సంబంధించిన వార్తలను గాని, ఇమ్రాన్ ఖాన్ లైవ్ ని గాని ప్రసారం చేస్తే ఆ ఛానల్ లైసెన్సును రద్దు చేస్తామని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ కమిషన్ తేల్చి చెప్పడంతో అక్కడ ఇమ్రాన్ ఖాన్ స్పీచెస్ ఆగిపోయాయి. కానీ భారత్ లో ఇమ్రాన్ ఖాన్ వార్తలకు రిస్ట్రిక్షన్ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఛానల్ ని కాదు భారతీయ ఛానల్ ని చూస్తే అర్ధమవుతుంది నేనేం చెప్తున్నానో అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: