ధరల పెరుగుదల, ఆర్థిక అవసరాలను తట్టుకోలేక ఇప్పుడు చాలా దేశాలు నూతన చట్టాలను తీసుకొస్తున్నాయి. పౌరసత్వం పొందాలంటే నానా రకాల సమస్యలు ఉండేవి. ప్రస్తుతం ఈజిప్టు దేశంలో డబ్బులుంటే చాలా అక్కడి పౌరసత్వం ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఈజిప్టు పౌండ్ సగానికి సగం పడిపోవడం.. మిలియన్ డాలర్లు ఉంటే అక్కడి పౌరసత్వం పొందొచ్చు . మిలియన్ డాలర్లు పెట్టి అక్కడి ఇళ్లు కొనుక్కుంటే పౌరసత్వం ఇస్తున్నారు.


మూడు లక్షల డాలర్లు ఉంటే అక్కడి గోల్డెన్ సిటిజన్ షిప్ ఇచ్చేందుకు ఈజిప్టు సిద్ధపడింది. కానీ ఒక షరతు విధించారు. ఇళ్లు కొనేవారు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఇళ్లనే కొనాలని చెబుతోంది. మూడున్నర లక్షల డాలర్లను అక్కడ ఏ సంస్థలో పెట్టినా పౌరసత్వం ఇస్తుంది. 5 లక్షల డాలర్లు డిపాజిట్ చేసి రెండు సంవత్సరాల పాటు వడ్డీ తీసుకోకుండా ఉంటే పౌరసత్వం ఇవ్వనుంది. ఇతర దేశాల వాళ్లను తన దేశంలోకి రమ్మని చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నం.


26 శాతం ధరల పెరుగుదల ఉండటంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఆహారం మీదనే 48 శాతం ధరలు పెరిగాయి. గోధుమలు, ఇతర ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  సంక్షోభం నంచి గట్టేక్కేందుకు ఈజిప్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది.


రష్యా, నుంచి ఉక్రెయిన్ నుంచి వలసలు వచ్చే అవకాశం ఉంది. జోర్డాన్ ఏడున్నర లక్షల డాలర్లు, టర్కీలో 4 లక్షల డాలర్లు, కాన్ బెర్రాలో లక్ష 25 వేలు, యూరప్, ఆస్ట్రేలియాలో  కూడా డబ్బులు పెడితే పౌరసత్వం ఇస్తారు. కానీ డబ్బులు పెట్టి పౌరసత్వం కొనుక్కునేది మాత్రం ఎక్కువగా తీవ్రవాదులే అని తేలుతోంది. పోనీ ఆయా దేశాల్లో పౌరసత్వం తీసుకున్న వారి డిటేల్స్ చెప్పమంటే మాత్రం చెప్పరు.

మరింత సమాచారం తెలుసుకోండి: