
వ్యాగనర్ గ్రూపు ఉక్రెయిన్ సెంట్రల్ ప్రాంతాల వరకు చేశారు. రష్యన్ వ్యాగనర్ గ్రూపు బాగ్ పూత్ అనే ప్రాంతంలోనికి చొచ్చుకెళ్లిపోయింది. దాదాపు సెంట్రల్ కు రెండు కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాగనర్ అనే సైనికులు చాలా కఠినాత్ములు ఎక్కడ కూడా ఎవరిని విడిచిపెట్టకుండా చంపేస్తూ భీకరమైన దాడులు చేస్తూ ఉక్రెయిన్ లోని నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ప్రాంతాలను రష్యా సైన్యానికి అప్పజెప్పేశారు. వీళ్లు కనపడిన ఉక్రేయిన్ మనుషులని చంపుకుంటూ వెళ్ళిపోతారు. అస్సలు కనికరమనేది లేకుండానే చేస్తారు.
ప్రస్తుతం వ్యాగనర్ చీప్ రష్యా అధ్యక్షుడికి ఒక సందేశాన్ని పంపించాడు. కీవ్ కు అత్యంత చేరువలోకి వెళ్లిపోయాం. ఇక మీ ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం అని చెప్పారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యన్ సైనికులు కనపడితే కాల్చేయాలని ఆదేశాలు ఇచ్చాడు. ముఖ్యంగా కీవ్ నగరంలోని పెద్ద పెద్ద భవంతులపై సైన్యాన్ని ఉంచారు. అక్కడ ఏ రష్యన్ సైనికుడు కనిపించినా కాల్చిపారేయాలని ఆదేశాలు ఇచ్చాడు. అయితే ఈ బిల్డింగ్ల పైనున్న సైనికులకు తెలియకుండానే రష్యన్ వ్యాగనర్ సైన్యం వారిని ముందుగానే అదుపులోకి తీసేసుకుంటుంది. ఉక్రెయిన్ లోని ప్రధాన ప్రాంతం లోకి కూడా రష్యన్ బలగాలు వచ్చేశాయి. ఇక కీవ్ స్వాధీనం అయిపోతే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధంలో గెలిచినట్టే లెక్క.