కరోనా మహమ్మారి వచ్చిన కొత్తలో చైనా ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టి ప్రజలను ఇంటికే పరిమితం చేసింది. సామాజిక దూరం పాటించి జలుబు, దగ్గు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా  కరోనా మహమ్మరితో కొన్ని లక్షల మంది కన్ను మూశారు. కరోనా మొదటి వేవ్ లో లాక్ డౌన్ పెట్టడం, తర్వాత కఠిన నియమాలు పాటించడం వల్ల మరణాల సంఖ్య తగ్గింది. రెండో వేవ్ లో మాత్రం కరోనా వచ్చిన వారికి శ్వాస సమస్యలు ఎక్కువగా వచ్చాయి. దీనివల్ల ఎంతో మంది మరణించారు. చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. ఎందుకంటే అప్పటికి కరోనా కు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ లు రాలేవు. మందులు లేవు. కరోనా వస్తే మన రోగ నిరోధక శక్తి మాత్రమే మనల్ని కాపాడాలి.


మొన్నటికి మొన్న చైనా లో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. దీని వల్ల ఎంతో నష్టం వాటిల్లింది.మళ్ళీ లాక్ డౌన్ పెట్టకపోవడం తో చైనా లో మొదటి కరోనాతో పోల్చుకుంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. కరోనా సమయంలో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రస్తుతం జలుబు, దగ్గు తో విపరీతంగా  అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లక్డౌన్ పెట్టాలని చూస్తోంది. జీవాయుధాలు తయారు చేయడం విఫలం కావడం తోనే కరోనా వైరస్ వచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది. అది కూడా వూహన్ లాబ్ లో నుంచి వైరస్ బయటకు వచ్చిందని చెప్పింది. చైనా ఈ విషయాన్ని గతంలోనే ఖండించింది.


కానీ ప్రస్తుతం అన్ని తెలిసి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కూడా కఠిన లాక్ డౌన్ పెట్టడం మూర్కత్వం అవుతుంది.మొత్తం మీద కరోనా మొదటికే అంతం కాలేదన్న విషయం నాలుగు వేవ్ ల ద్వారా తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అందరు బహిరంగ ప్రదేశాలకు వెళితే మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: