కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనే సామెత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విషయంలో నిజమైంది. అక్కడ భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇచ్చే స్థాయి నుండి, విజయాలు సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది. 2014 నుంచి 2024 ఈ దశాబ్ద కాలంలో, కరెక్ట్ గా 2019 నుంచి భారతీయ జనతా పార్టీ పరుగులు తీయడం మొదలుపెట్టిందని చెప్పాలి.


2014 ఎన్నికల్లో టిడిపి తో కలిసి సాధించిన విజయం తమది అని చెప్పుకొని ఓన్ చేసుకోవడంలో, 2019 ఎన్నికల్లో అది పరాజయం పాలైన సందర్భం వచ్చింది. అంతకుముందు టిడిపి తో కలిసి 20 సీట్లు సాధిస్తే టిడిపి లేకపోతే బిజెపి పరిస్థితి ఏంటి అంటే ఒక్క సీటుకే పరిమితం అని చెప్పాలి. అదే తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు గెలిచింది. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మూడు శాతం లోపు అయితే ఏడు శాతం సాధించింది అప్పుడు.


ప్రత్యామ్నాయంగా తయారవ్వలేకపోయామనే  ఆవేదనని ఆ తర్వాత 2019 పార్లమెంటరీ ఎన్నికలు సరిచేసాయి. ఏకంగా రెండో స్థానానికి తీసుకెళ్లాయి. 9 స్థానాలు టిఆర్ఎస్ గెలుచుకుంటే నాలుగు స్థానాలు బిజెపి గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్, మిగిలిన పార్టీలు దాని తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి అప్పుడు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్, స్థానిక, పంచాయతీ ఎన్నికలలో ఓటమి, ఒకరకంగా బిజెపి ని నైరాశ్యానికి గురి చేసింది.


ఆ తర్వాత దుబ్బాక అనేది భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు మీద ఒక ఆశను కలిగించింది.  ఆ తర్వాత మళ్లీ ఓటమి పాలు అయిపోతున్న సందర్భంలో ఈటల రాజేందర్ పార్టీలో చేరడం, విజయం సాధించడం అనేది తిరిగి బిజెపికి ఒక ధైర్యాన్ని కలిగించింది. ఇంకోవైపు డీకే అరుణలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత మంది జాయిన్ అవ్వడంతో మరికొంత ధైర్యం చేకూరినట్టు అయింది. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కి చుక్కలు చూపించింది బిజెపి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR