దమ్ముంటే రండి అంటూ ఖలిస్థాన్ వేర్పాటు వాదుల నాయకుడు అమృత్ పాల్ సింగ్ ఛాలెంజ్ విసిరారు.  లండన్, కెనడా లాంటి దేశాల్లో ఉంటున్న సిక్ ఫర్ జస్టిస్ సంస్థ ఇచ్చే డబ్బులతో పంజాబ్ నుంచి ఖలిస్థాన్ అనే ప్రాంతాన్ని వేరు చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంట్లో భాగంగానే వారం రోజుల కిందట అమృత్ పాల్ అనే ఖలిస్థాన్ వేర్పాటు వాది చేసినా అరాచకం అంతా ఇంతా కాదు.


ఏకంగా పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పంపిస్తుందా.. లేక సైన్యమే వస్తుందా చూసుకుందాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు విడిచిపెట్టినా పోలీసులు కేంద్రం నుంచి  పక్క సందేశం వచ్చింది. ఇలాంటి వ్యక్తులని రక్షిస్తే, ఏమీ చేయకుండా విడిచిపెడితే దేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలు, అమాయకుల ప్రాణాలు తీస్తారు. అల్లర్లకు కారణమవుతారు.


దేశ స్వాతంత్య్ర పోరాటంలో పంజాబీ నాయకుల పాత్ర మరువలేనిది. ఇలాంటి వారిని చూస్తూ ఊరుకోకండి వెంటనే అరెస్టు చేయండని ఆదేశాలు అందాయి. దీంతో పంజాబ్ పోలీసులు గట్టి యాక్షనే తీసుకున్నారు. 74 మంది అల్లర్లు చేసిన వారిని అరెస్టు చేశారు. అమృత్ పాల్ సింగ్ ను అదుపులోకి తీసుకునేందుకు వెంట పడ్డారు. దీంతో మారుమూల పల్లెటూళ్లో దాక్కున్నట్లు సమాచారం.


ప్రాణ భయంలో ఫేస్ బుక్ లైవ్ లో నన్ను కాపాడండని మొర పెట్టుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ పెట్టారు. ఈ తీవ్రవాదిని పట్టుకుని అరెస్టు చేసే వరకు వెంటాడుతూనే ఉంటామని పంజాబ్ కమిషనర్ తెలిపారు. కాబట్టి  ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో  మరో సారి చిచ్చు పెట్టేందుకు వచ్చిన అతడిని ఏ కోశాన క్షమించేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు కుదటపడేదాక కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాకపోవచ్చు.  ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: