
అయినా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇప్పటివరకు మేం అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నం చేస్తున్నాం. తప్ప వేరే దేశాల్ని నిందించడం లేదు. ఒక వేళ మాకు స్నేహితులుగా ఉన్న దేశాల్లో అమెరికా, యూరప్ దేశాలు పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ అక్కడ మేం ఎప్పుడూ కూడా ఆంక్షలు విధించాలని కోరలేదు.
అలా చేస్తే మీ దేశాలు తట్టుకుంటాయని కూడా అనుకోవడం లేదు. చైనా, ఉత్తర కొరియా దేశాలు రష్యా తో సన్నిహితంగా ఉంటున్నాయి. చైనాలో అమెరికా ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాయి. వాటిని మేం స్తంభింపజేయాలని అనుకోవడం లేదు. కానీ మా పైన ఎన్ని ఆంక్షలు పెట్టారో గుర్తు చేసుకోండని అన్నారు. అయితే ఈ విధమైన ఆలోచన మొదటి సారి రష్యాకు వచ్చింది.
దీనిపై అమెరికా, యూరప్ దేశాలు కాస్త సందేహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, చైనా కలిపి వ్యాపార సంస్థల్ని నిషేధించే పనిలో ఏమైనా ఉన్నాయనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఒక వేళ చైనాలో అమెరికా వ్యాపార, వాణిజ్య సంస్థల్ని బ్యాన్ చేస్తే ప్రత్యేక ఆదేశాలు తీసుకువస్తే అమెరికాకు ఎన్ని లక్షల కోట్ల నష్టం జరుగుతుంది. అంచనా వేయడానికే ఊహకందకుండా ఉంటుందనడంలో సందేహం లేదు. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.