
28 మంది లోకల్ టెర్రరిస్టులు ఉన్నారని ఈ మధ్యే సైన్యం ప్రకటించింది. ఇంతలోనే బాంబు దాడి జరగడంతో సైన్యం ఊహించిందే నిజమని తెలుస్తోంది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కథువా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 6 పట్టణాలు, 512 గ్రామాలు, ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్న ఈ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ బాంబు దాడి వెనక ఎవరున్నారనే కోణంలో సైన్యం విచారణ చేపట్టింది. 2021లో టిపిన్ బాంబులు పెట్టినటువంటి వారే ఈ బాంబు దాడికి పాల్పడి ఉంటారనే కోణంలో విచారిస్తున్నారు.
16 డ్రోన్లను ఈ మధ్య సైన్యం పేల్చేసింది. 2021 లో టిపిన్ బాంబులకు పాల్పడిన వారే ప్రస్తుతం అమృత్ సర్ లో దాడులు చేసేందుకు వ్యుహం పన్నినట్లు తెలుస్తోంది. కపుర్తాలా, పసింగా, తరున్ తాగార్ లాంటి ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని సైన్యం ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
డ్రోన్లతో విచ్చలవిడిగా చేస్తున్న దాడుల వల్ల సైన్యం అలర్ట్ అయింది. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎవరూ పంపిస్తున్నారనే కోణంలో సెర్చ్ చేస్తున్నారు. ఆ మధ్య సాంబ జిల్లాలో పిస్టళ్లు, మందు గుండు సామగ్రి, ఇతర ఆయుధాలను సైన్యం పట్టుకుంది. ప్రశాంతంగా ఉన్న భారత్ లో మళ్లీ అలజడులు రేపేందుకు పాకిస్థాన్ లోని ఉగ్రవాద ముఠాలు ప్లాన్ చేస్తున్నట్లు సైన్యం అనుమానిస్తోంది.