ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో నైనా హిందువులు దారుణాలకు గురై చనిపోతే స్పందించే వారు కరవయ్యారు. అదే వేరే మతానికి చెందిన ఏ వ్యక్తి చనిపోతే లేదా దాడికి గురైతే ప్రపంచ దేశాలు మేమున్నాం అని పరుగెత్తుకుంటూ వస్తాయి. అక్కడ దారుణం జరిగిపోతుంది  దాన్ని ఆపాలని మొత్తుకుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం దేశాలు, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. కానీ ఈ భూగోళం పై హిందూ దేశం ప్రత్యేకంగా లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.


రాహుల్ గాంధీ అరెస్టు అంశంపై మేం గమనిస్తూనే ఉన్నాం అని జర్మనీ యూరప్ దేశాలు చెబుతున్నాయి. కానీ భారత్ లో ఎక్కువ మంది హిందువులు ఉండే దేశంలో హిందూ పండగలు చేసుకుంటుంటే రాముని విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఖండించే వారు కనిపించడం లేదన్న వాదన ఉంది. ఎక్కడో గో వధ జరుగుతున్న ప్రాంతంలో ఎవరో ఒక వ్యక్తిని కొట్టారంటే అది వివాదాస్పదం అయి ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సరే హిందువుల మీద దాడులు జరిగితే ఎవరూ స్పందించడం లేదన్న వాదన ఉంది.


ప్రస్తుతం  పాకిస్థాన్ లో హిందువులను కాల్చి చంపేస్తున్నారు. అయినా ప్రపంచ దేశాలు ఎక్కడ ఎవరూ స్పందించడంలేదు. పాక్ లో మార్చి 30 తారీఖున సింది హిందు  డాక్టర్ బీర్బల్ మేగ్వర్ ను కరాచీ తుపాకితో కాల్చి చంపారు. మార్చి 31 న దయాల్ సింగ్ అనే సిక్కును పెషావర్ లో కాల్చి చంపారు.  క్రిస్టియన్ మతానికి చెందిన కాసీ వాసిప్ ను ఏప్రిల్ 1 వ తేదీన పెషావర్ లో దుండగులు హత్య చేశారు. ఇంత దారుణాలు పాకిస్థాన్ లో జరుగుతున్నా ప్రపంచం మాత్రం చప్పుడు చేయదు. ముఖ్యంగా మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుందని భావించి గగ్గోలు పెట్టే వారు సైలైంట్ గా ఉండిపోతారు. ఇలాంటి విధానాలు మారాలి. ప్రతి మతాన్ని సమానంగా చూసే రోజులు రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: